తెలంగాణ

telangana

ETV Bharat / international

'హాంకాంగ్​'పై లండన్​లో పోటాపోటీ నిరసనలు

హాంకాంగ్, చైనా మద్దతుదారులు ఇంగ్లాండ్ రాజధాని లండన్​లో పోటాపోటీగా నిరసనలు చేపట్టారు. చైనా నుంచి హాంకాంగ్​కు విముక్తి కావాలంటూ కొందరు ఆందోళనలు చేయగా.. చైనా మద్దతుదారులు వ్యతిరేక నిరసనలతో హోరెత్తించారు.

లండన్​ వీధుల్లో హాంకాంగ్​ మద్దతుదారుల నిరసనలు

By

Published : Aug 18, 2019, 6:04 AM IST

Updated : Sep 27, 2019, 8:47 AM IST

లండన్​లో పోటాపోటీ నిరసనలు

ఇంగ్లాండ్​ రాజధాని లండన్​లో హాంకాంగ్​, బీజింగ్ మద్దతుదారులు పోటాపోటీగా ఆందోళనలు చేపట్టారు. నేరస్థులను చైనాకు అప్పగించే బిల్లుపై హాంకాంగ్​లో జరుగుతున్న నిరసనలకు మద్దతుగా లండన్​లో కొందరు ఆందోళనలు చేశారు. వీటికి ప్రతిగా చైనా మద్దతుదారులు ప్రదర్శనలు నిర్వహించారు.

బ్రిటన్​.. హాంకాంగ్​కు మద్దతుగా నిలవాలంటూ నిరసనకారులు ప్రదర్శన చేపట్టారు. 'హాంకాంగ్​కు మద్దతుగా నిలవండి', 'బ్రిటన్ ప్రధాని బోరిస్ చైనాకు లోంగిపోతారా?' అంటూ నిరసనకారులు ప్లకార్డులు ప్రదర్శించారు. హాంకాంగ్​ను చైనా కబంధహస్తాలకు అప్పగించొద్దంటూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా బ్రిటీష్​ వలస కాలంలోని హాంకాంగ్​ జెండాను నిరసనకారులు ఎగురవేశారు.

చైనా మద్దతుదారుల పోటీ ప్రదర్శన

హాంకాంగ్​ ప్రదర్శనకారులకు వ్యతిరేకంగా చైనా మద్దతుదారులు నిరసన చేపట్టారు. హాంకాంగ్​ నిరసనకారులను 'దేశ ద్రోహులు అంటూ నిందించారు. 'ఒక దేశం-ఒక చైనా', 'హాంకాంగ్​ ఎప్పటికీ చైనాలో భాగమే' అంటూ నినాదాలు చేశారు.

పారిస్... పసుపు చొక్కా ఉద్యమకారుల మద్దతు

ఫ్రాన్స్​లోని కొందరు 'పసుపు చొక్కాల నిరసనకారులు'.... హాంకాంగ్​ ప్రజాస్వామ్యవాదులకు మద్దతు ప్రకటించారు.

సెమీ అటానమస్​ స్టేట్​

చైనాతో కుదుర్చుకున్న జాయింట్ డిక్లరేషన్​ ఆధారంగా 1997లో బ్రిటన్... హాంకాంగ్​ నియంత్రణను డ్రాగన్​కు అప్పగించింది. ఈ డిక్లరేషన్​ ప్రకారం 2047 వరకు ఇది సెమీ అటానమస్​ నగరంగా ఉంటుంది. ఆ తరువాత పూర్తి స్వేచ్ఛ పొందుతుంది.

నిరసనలు తీవ్రరూపం..

హాంకాంగ్​లో పదివారాలుగా కొనసాగుతున్న ప్రజా స్వామ్యవాదుల నిరసన... ఇప్పుడు మరింత ఉద్ధృతంగా మారుతోంది. శనివారం వేలాది మంది నిరసనకారులు.. వీధుల్లోకి వచ్చి హక్కుల కోసం గళమెత్తారు. ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికలు నిర్వహించాలని, నేరస్థులను చైనాకు అప్పగించే బిల్లును శాశ్వతంగా విరమించుకోవాలని డిమాండ్​ చేశారు. హాంకాంగ్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ క్యారీ లూమ్​ రాజీనామా చేయాలని నినదించారు.

ఇదీ చూడండి: మధురై మీనాక్షి పట్టాభిషేకంలో మహాత్ముడు!

Last Updated : Sep 27, 2019, 8:47 AM IST

ABOUT THE AUTHOR

...view details