తెలంగాణ

telangana

ETV Bharat / international

కృష్ణాష్టమి నాడే పాక్​లో హిందూ ఆలయం ధ్వంసం - pak mob attack

పాకిస్థాన్​లో మరో హిందూ ఆలయాన్ని కొందరు దుండగులు ధ్వంసం చేశారు. సింధ్​ జిల్లా సంఘర్​ జిల్లా ఖిప్రోలో ఈ ఘటన జరిగింది.

Hindu temple vandalised in Pak's Sindh province
కృష్ణాష్టమి నాడే పాక్​లో హిందూ ఆలయం ధ్వంసం

By

Published : Aug 31, 2021, 10:36 AM IST

Updated : Aug 31, 2021, 2:02 PM IST

పాకిస్థాన్​లో హిందూ ఆలయాలపై దాడులు కొనసాగుతున్నాయి. సింధ్ రాష్ట్రం సంఘార్​ జిల్లా ఖిప్రోలోని ఓ గుడిని కొందరు దుండగులు ధ్వంసం చేశారు.

రాహత్​ జాన్ ఆస్టిన్​ అనే హక్కుల కార్యకర్త ఈ విషయం ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. "హిందువులు కృష్ణాష్టమి జరుపుకుంటున్న వేళ వారి దేవుడ్ని అవమానించేలా ఖిప్రోలో ఓ ఆలయాన్ని ధ్వంసం చేశారు. పాకిస్థాన్​లో ఇస్లాంను దూషించారన్న అసత్య ఆరోపణలు వస్తేనే.. మూకదాడి చేసి చంపుతారు. లేదా మరణశిక్ష విధిస్తారు. కానీ.. ఇతర మతాల దేవుళ్ల విషయంలో జరిగే దాడులను మాత్రం పట్టించుకోరు" అని పోస్ట్ చేశారు జాన్ ఆస్టిన్.

హిందూ ఆలయం ధ్వంసం

రాహత్ జాన్​ ఆస్టిన్... పాకిస్థాన్​లో పుట్టిన క్రైస్తవుడు. ఆ దేశంలోని మైనారిటీల కోసం ఎప్పుడూ గళం వినిపిస్తుంటారు. దాడులకు భయపడి పాకిస్థాన్​ వదిలి పారిపోయి, ప్రస్తుతం కుటుంబంతో కలిసి దక్షిణ కొరియాలో నివసిస్తున్నారు.

వరుస దాడులు

పాకిస్థాన్​లో హిందూ ఆలయాలపై దాడులు ఇటీవల ఎక్కువయ్యాయి. కొద్దిరోజుల క్రితమే కొందరు రహీమ్​ యార్​ ఖాన్​ జిల్లాలోని భోంగ్​ గ్రామంలోని గుడిని కొందరు ధ్వంసం చేశారు.

ఆలయాలపై దాడుల విషయంలో భారత్​ ఎప్పటికప్పుడు పాకిస్థాన్​ ప్రభుత్వానికి తన అసంతృప్తిని తెలియజేస్తోంది.

ఇదీ చూడండి:మలేసియాలో రాజకీయ అస్థిరత.. ఆజ్యం పోస్తున్న కరోనా

Last Updated : Aug 31, 2021, 2:02 PM IST

ABOUT THE AUTHOR

...view details