భారీ వరదలకు అఫ్గానిస్థాన్ అతలాకుతలమైంది. వందల సంఖ్యలో ఇళ్లు, వృక్షాలు నేలమట్టమయ్యాయి. వేల మంది నిరాశ్రయులయ్యారు. 32 మంది ప్రాణాలు కోల్పోయారని నార్వేజియన్ శరణార్థ మండలి పేర్కొంది. వరదల కారణంగా ఒక్క దక్షిణ కందహార్ ప్రాంతంలోనే సుమారు 4 వేల కుటుంబాలు రోడ్డున పడ్డాయి.
వరదల బీభత్సం - ఆఫ్గానిస్థాన్
అఫ్గానిస్థాన్‌లో వరదలు బీభత్సం సృష్టించాయి. వందల ఇళ్లు నేలమట్టమయ్యాయి. 32 మంది మరణించారు.
ఆఫ్గానిస్థాన్‌లో వరదలు బీభత్సం సృష్టించాయి
నాలుగు రోజుల పాటు దేశాన్ని కుదిపేసిన వరదలు సోమవారానికి తగ్గుముఖం పట్టాయి.దేశవ్యాప్తంగా సహాయక చర్యలు ముమ్మరం చేసినట్లు అధికారులు తెలిపారు.
దేశవ్యాప్తంగా భారీగా కురుస్తున్న మంచు వల్ల వరదలు సంభవించాయి. ఈ ఏడాదిలో ఇప్పటి వరకు వరదల కారణంగా సుమారు 50 మంది మరణించినట్లు అధికారులు తెలిపారు.