తెలంగాణ

telangana

ETV Bharat / international

చైనా, జపాన్​లో ముంచెత్తిన వరదలు- 25 మంది మృతి - చైనాలో భారీ వర్షాలు

చైనా, జపాన్​లో వరదలు బీభత్సం సృష్టిస్తున్నాయి. హుబేయ్‌ ప్రావిన్స్‌లో.. కురుస్తున్న భారీ వర్షాల ధాటికి 21 మంది ప్రాణాలు కోల్పోగా నలుగురు గల్లంతైనట్లు స్థానిక అధికారులు పేర్కొన్నారు. జపాన్​లో బురదతో కూడిన వరదతో నలుగురు మృతి చెందారు.

heavy rains, china
చైనా, భారీ వర్షాలు

By

Published : Aug 13, 2021, 12:25 PM IST

చైనాలో పోటెత్తిన వరద

ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల్లో వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. చైనాలో కురిసిన భారీ వర్షాలకు 21 మంది ప్రాణాలు కోల్పోయారు. సెంట్రల్​ చైనా హుబేయ్​ ప్రాంతంలో నలుగురు గల్లంతైనట్లు అధికారులు వెల్లడించారు.

సుచియాన్​ కౌంటీ లియులిన్​ టౌన్​షిప్​లో బుధ, గురువారాల్లో 503 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైనట్లు అధికారులు పేర్కొన్నారు. 3.5 మీటర్ల లోతు మేర నీళ్లు నిలిచిపోయాయని స్పష్టం చేశారు.

కొట్టుకుపోయిన వాహనాలు

8,000 మందిపై వర్షం ప్రభావం చూపిందని అధికారులు తెలిపారు. సహాయ చర్యలు ముమ్మరం చేసినట్లు వెల్లడించారు. ఈ నేపథ్యంలో సెంట్రల్​ చైనాలోని కొన్ని ప్రాంతాల్లో ప్రమాద హెచ్చరికలు జారీ చేసింది చైనా వాతావరణ శాఖ.

వరద

హుబేయ్, అన్​హుయి, హునన్, జియాంక్సి, జెజియాంగ్ ప్రాంతాల్లో శుక్రవారం భారీ వర్షాలు పడే అవకాశముందని వాతావారణ శాఖ హెచ్చరించింది. 200 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు కానుందని తెలిపింది.

వర్షాలకు కిందపడిపోయిన విద్యుత్ తీగలు

గతనెల చైనాలో పోటెత్తిన వరదల కారణంగా 300 మంది ప్రాణాలు కోల్పోయారు, దాదాపు 50 మంది గల్లంతయ్యారు.

భారీ వర్షాలకు సెంట్రల్ చైనా అతలాకుతలం

జపాన్​ అతలాకుతలం..

భారీ వర్షాలకు జపాన్​ అతలాకుతలం అవుతోంది. బురదతో కూడిన వరదల ధాటికి నలుగురు బలయ్యారు. మరో ఇద్దరు గల్లంతైనట్లు విపత్తు నిర్వహణ బృందం తెలిపింది.

క్యూషు, హిరోషిమా ప్రాంతాల్లో భారీగా వర్షపాతం నమోదయ్యే అవకాశముందని జపాన్ వాతావరణ శాఖ హెచ్చరించింది.

ఇదీ చదవండి:వరదల ధాటికి చైనాలో 302 మంది మృతి

ABOUT THE AUTHOR

...view details