దక్షిణ చైనాలో వరదలు పోటెత్తాయి. కుండపోత వర్షాలకు ప్రధాన నదులు పొంగి ప్రవహిస్తున్నాయి. వివిధ ప్రాంతాల్లో కొండచరియలు విరిగిపడ్డాయి. ఇప్పటివరకు ముగ్గురు మరణించగా... వేల మంది నిరాశ్రయులయ్యారు.
చైనాలో భారీ వర్షాలు.. ముగ్గురు మృతి - heavy rains in china
చైనాలో కుండపోతగా వర్షాలు కురుస్తున్నాయి. దీనితో దక్షిణ చైనాలోని గుయిజౌ ప్రావిన్స్‌లో గ్రామాలు, పట్టణాలు జలమయమయ్యాయి. కిజియాంగ్ నది పొంగడం వల్ల 40 వేల మంది ఎగువ ప్రాంతాలకు తరలివెళ్లారు. వరదల్లో కొట్టుకుపోయి ముగ్గురు మృతి చెందారు.

చైనాలో భారీ వర్షాలు... ముగ్గురు మృతి
వరదల కారణంగా గుయిజౌ ప్రావిన్స్‌లోని చాలా గ్రామాలు, పట్టణాలు నీటమునిగాయి. 15 వేల మంది సురక్షిత ప్రాంతాలకు తరలిపోయారు. చాంగ్కింగ్ నగరంలోని కిజియాంగ్ నది పొంగి ప్రవహిస్తుండటం వల్ల 40 వేల మంది ఎగువ ప్రాంతాలకు వెళ్లాల్సి వచ్చింది. అధికారులు సహాయక చర్యలు చేపట్టారు. భారీ వరదలకు ఈ ఏడాదిలో ఇప్పటికే 20 మంది వరకు చనిపోయారు.
ఇదీ చూడండి:చైనా వెన్నుపోటు- నేపాల్ భూభాగం దురాక్రమణ