అఫ్గానిస్థాన్‌లో భారీ వర్షాల ధాటికి వరదలు సంభవించాయి. దీని వల్ల 37 మంది మరణించారు. వీరిలో కొంతమంది పిల్లలు ఉన్నట్లు అధికారులు తెలిపారు. ఆదివారం నుంచి అఫ్గాన్‌లోని 9 రాష్ట్రాల్లో ఎడతెరిపిలేకుండా వర్షాలు కురుస్తున్నాయి.
వరదల కారణంగా ఆదివారం ఒక్కరోజే 24 మంది మరణించినట్లు గవర్నర్ల అధికార ప్రతినిధి జైలాని ఫర్హాద్ తెలిపారు.ఘోర్ రాష్ట్రంలో మరణించిన 10 మందిలో ఆరుగురు పిల్లలు ఉన్నట్లు ఆ రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ తాహిర్ ఫైజ్దా పేర్కొన్నారు.