డాల్ఫిన్లు ఎక్కువగా ఏ రంగులో ఉంటాయి? బూడిద లేదా నీలం రంగులో కనిపిస్తాయి. అయితే గులాబీ రంగులో ఉన్న డాల్ఫిన్‌ను ఎప్పుడైనా చూశారా? అయితే ఈ వీడియో మీ కోసమే! ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ (ఐఎఫ్ఎస్) అధికారి సుశాంత నంద ట్విట్టర్లో షేర్ చేసిన ఓ వీడియోలో పింక్ కలర్ డాల్ఫిన్లు కనిపిస్తున్నాయి. దీంతో ఈ వీడియో వైరల్‌గా మారింది.
వియత్నాంలోని హై ఫోంగ్ సిటీ సమీపంలో ఉన్న డు సన్ బీచ్ దగ్గర ఈ వీడియో తీశారు. దీనిని ఇప్పటికే 73వేల మందికి పైగా వీక్షించారు. అందులో బూడిద రంగు డాల్ఫిన్లతో కలిసి గులాబీ రంగు డాల్ఫిన్ ఈత కొట్టడాన్ని మనం గమనించొచ్చు. ఈ కొత్త తరహా డాల్ఫిన్‌పై నెటిజన్లు ఆసక్తి చూపిస్తున్నారు. జన్యుపరమైన మార్పుల వల్ల పింక్ కలర్లో డాల్ఫిన్ జన్మించి ఉండొచ్చని ఓ నెటిజన్ పేర్కొన్నాడు.