తెలంగాణ

telangana

ETV Bharat / international

ఫొటోలు బహిర్గతం చేశారని మీడియాపై ప్రిన్స్​ హ్యారీ మండిపాటు - harry and meghan updates

వ్యక్తిగత జీవన ప్రయాణాన్ని బహిర్గతం చేస్తున్నారని మీడియాపై ఆగ్రహం వ్యక్తం చేశారు హ్యారీ. తన భార్య మేఘన్​, కుమారుడు ఆర్కీతో ఉన్న ఫొటోలను ప్రచురించిన వార్త సంస్థలపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

harry
ఫొటోలు బహిర్గతం చేశారని మీడియాపై హ్యారీ మండిపాటు

By

Published : Jan 22, 2020, 11:29 AM IST

Updated : Feb 17, 2020, 11:18 PM IST

బ్రిటన్​ రాజ కుటుంబం బాధ్యతల నుంచి తప్పుకున్న ప్రిన్స్​ హ్యారీ.. మీడియాపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ వ్యక్తిగత జీవన ప్రయాణాన్ని మీడియా బహిర్గతం చేస్తోందని వాపోయారు. తన భార్య మేఘన్‌, కుమారుడు ఆర్కీతో ఉన్న ఫొటోలను ప్రచురించిన సన్‌, డెయిలీ మెయిల్‌ పత్రికలపై చట్టపరంగా చర్యలు తీసుకుంటామన్నారు. ఆ వార్త పత్రికలకు నోటీసులు జారీ చేశారు హ్యారీ తరఫు న్యాయవాది.

రాజ సంరక్షకులు చివరిసారిగా తోడు రాగా.. భుజానేసుకున్న జోలిలో ఆర్కీ, ముందు రెండు పెంపుడు కుక్కలతో కలిసి మేఘన్ కొత్త జీవితాన్ని ప్రారంభించబోయే ఇంటికి చేరుకున్నారు. ఈ ఫొటోలన్నీ మీడియాలో ప్రత్యక్షమయ్యాయి. మేఘన్​ అనుమతి లేకుండా సదరు ఫొటోగ్రాఫర్లు దొంగచాటుగా ఫొటోలు తీశారని హ్యారీ చెప్పారు. కెమెరాలకు, మీడియాకు దూరంగా ఉండాలనే రాజకుంటుంబం నుంచి తప్పుకున్నామని మరోసారి స్పష్టం చేశారు. తమ అనుమతి లేకుండా వాంకోవర్‌ దీవిలోని తమ ఇంటిని పైతం ఫొటోలు తీశారని వారిపై కూడా చర్యలు తప్పవని హెచ్చరించారు.

కెమెరా క్లిక్‌ అన్నప్పుడల్లా తన తల్లి చావే గుర్తుకు వస్తుందని గతంలో ఆవేదన వ్యక్తం చేశారు హ్యారీ.

ఇదీ చూడండి:చైనాలో కరోనా వైరస్​ విజృంభణ... 9కి చేరిన మృతులు

Last Updated : Feb 17, 2020, 11:18 PM IST

ABOUT THE AUTHOR

...view details