ముంబయి దాడుల సూత్రధారి, ఉగ్రవాద సంస్థ జమాత్-ఉద్-దావా (జేయూడీ) అధినేత హఫీజ్ సయీద్‌కు పవిత్ర 'ఈద్ ఉల్ ఫితర్' సందర్భంగా పాకిస్థాన్ ప్రభుత్వం షాకిచ్చింది. పాకిస్థాన్ పంజాబ్‌లోని ఖడాఫీ మైదానంలో జరిగిన పవిత్ర ఈద్ ప్రార్థనలకు సారథిగా ఉండేందుకు ఆయనకు అనుమతి నిరాకరించింది.
ఇందుకు బదులుగా స్థానిక మసీదుల్లో నిర్వహించే ప్రార్థనలకు సారథిగా వ్యవహరించేందుకు సయీద్‌కు అనుమతినిచ్చినట్లు పాక్ అధికార ప్రతినిధి తెలిపారు.
"జేయూడీ ఉగ్రసంస్థ అధినేత మొదట ఖడాఫీ మైదానంలో ఈద్ ప్రార్థనలు చేయించాలని భావించాడు. అయితే ఈద్‌కు ఒక రోజు ముందు అతను ప్రార్థనలకు సారథిగా వ్యవహరించకూడదని ప్రభుత్వం నిర్ణయం ప్రకటించింది. ఒక వేళ సయీద్ ముందుగా అనుకున్నట్లుగానే ప్రార్థనలకు సారథిగా ఉంటే.. ప్రభుత్వం అతణ్ని అరెస్టు చేసి ఉండేది." - పాక్ అధికారి
ప్రభుత్వ ఆదేశాలను పాటించడం తప్ప సయీద్‌కు వేరే ప్రత్యామ్నాయం లేదు. ఖడాఫీ మైదానంలో ప్రార్థనలు ఆపేందుకు కూడా అవకాశం లేదని అధికారి తెలిపారు.