అఫ్గానిస్థాన్ కాబుల్‌లోని సిక్కు గురుద్వారాపై ఉగ్రవాదులు దాడికి తెగబడ్డారు. ఈ ఘటనలో 27మంది మృతిచెందారు. మరో 8 మంది గాయపడ్డారు. నలుగురు ముష్కరుల్ని భద్రతా సిబ్బంది మట్టుబెట్టారు.
షోర్బజార్ ప్రాంతంలోని ఈ ప్రార్థనా మందిరంలో స్థానిక కాలమానం ప్రకారం ఉదయం 7.45కు ఈ దాడి జరిగింది. ఆ సమయంలో అక్కడ 150 మంది ఉన్నారు. మొత్తం నలుగురు ముష్కరులు తుపాకులతో విరుచుకుపడగా అఫ్గాన్ బలగాలు దీటుగా ఎదుర్కొన్నాయి. అనేక గంటలపాటు శ్రమించి నలుగురినీ మట్టుబెట్టాయి.
ఐఎస్ ప్రకటన..
గురుద్వారాపై దాడి తమ పనేనని ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాద సంస్థ ప్రకటించుకుంది.