అఫ్గానిస్థాన్ కాబుల్ యూనివర్సిటీలో కాల్పులు జరిగాయి. దుండగుల దాడిలో ఆరుగురికి గాయాలైనట్లు ప్రభుత్వ వైద్యాధికారి అఖ్మల్ సామ్సర్ తెలిపారు. సోమవారం అఫ్గాన్, ఇరాన్ అధికారులు బుక్ ఎగ్జిబిషన్‌ను ప్రారంభిస్తున్న సమయంలో ఈ ఘటన జరిగిందని వివరించారు.
కాల్పుల సమయంలో క్యాంపస్‌లో తరగతులు నిర్వహిస్తున్నామని యూనివర్సిటీ ప్రొఫెసర్ జబియుల్లా హైదరీ తెలిపారు. వెంటనే భద్రతా బలగాలతో కలసి విద్యార్థులను బయటకు తరలించామని వివరించారు.
భద్రతా బలగాలు క్యాంపస్‌కు వచ్చే దారుల్ని మూసివేశారు. ఏ సంస్థ ఈ దాడికి పాల్పడిందో తెలియాల్సి ఉంది.