నిబంధనల మార్పుపై అన్ని అంశాలను తమ కేబినెట్ పరిశీలిస్తుందని జెసిండా తెలిపారు. ప్రైవేట్ వ్యక్తుల అధీనంలోని సెమీ ఆటోమేటిక్ రైఫిల్స్ నిషేధానికీ నిర్ణయం తీసుకోనున్నామన్నారు. నూతన నిబంధనల ప్రకారం ప్రైవేటు వ్యక్తుల వద్ద ఉన్న ఆయుధాలను స్వాధీనం చేసుకుంటామని స్పష్టం చేశారు.
తుపాకీ సంస్కృతిపై కివీ యుద్ధం
క్రైస్ట్‌చర్చ్ ఉగ్ర నరమేధంతో తుపాకీ వాడకంపై కఠిన నిబంధనలు అమలు చేసేందుకు న్యూజిలాండ్ ప్రభుత్వం సిద్ధమైంది. ఇందుకోసం చట్టాలు చేస్తామని ప్రధాని జెసిండా ఆర్డెర్న్ ఇచ్చిన హామీపై కివీ పౌరులు సంతోషం వ్యక్తం చేశారు.
తుపాకీ సంస్కృతిపై కివీ యుద్ధం
తుపాకుల విషయంలో ఆస్ట్రేలియా పద్ధతులనే పాటించాలని న్యూజిలాండ్ పౌరులు ఆకాంక్షిస్తున్నారు. 1996లో టాస్మానియాలో జరిగిన నరమేధంలో 35 మంది మరణించారు. ఘటనను తీవ్రంగా పరిగణించిన ఆస్ట్రేలియా తుపాకులు కలిగి ఉండటంపై భారీ స్థాయిలో నిషేధం విధించింది. ముఖ్యంగా సెమీ ఆటోమేటిక్ రైఫిళ్లను పూర్తిగా నిషేధించింది.
ఇదీ చూడండి:నరమేధంలో ఐదుగురు భారతీయులు బలి