చైనాలోని ప్రముఖ రేవు పట్టణం దలియాన్‌లో ఏడు కరోనా వైరస్ కేసులు నమోదైన నేపథ్యంలో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. ఒక్క రోజులోనే లక్షల సంఖ్యలో నిర్ధరణ పరీక్షలు చేసింది. బహిరంగ ప్రదేశాలను, పాఠశాలలను మూసివేసింది. అత్యవసరమైతే తప్ప ఇళ్లు దాటి బయటకు రావద్దని ఆదేశాలు జారీ చేసింది ప్రభుత్వం.
చైనాలో మళ్లీ కరోనా కేసులు- లక్షల కొద్దీ టెస్టులు - ప్రపంచంలో కరోనా కేసుల సంఖ్య
చైనాలో తగ్గుముఖం పట్టిన కరోనా కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. దీంతో అప్రమత్తమైన స్థానిక అధికారులు పెద్ద ఎత్తున నిర్ధరణ పరీక్షలు చేస్తున్నారు. ముఖ్యంగా ఇతర దేశాల నుంచి చైనాలోకి వచ్చే రేవు పట్టణాల్లో లక్షల కొద్దీ టెస్టులు చేయిస్తున్నారు.
చైనాలో మళ్లీ కరోనా కేసులు.. లక్షల కొద్దీ టెస్టులు
బీజింగ్‌లోనూ కొత్త కేసులు నమోదైన నేపథ్యంలో హై అలర్ట్ ప్రకటించారు. పెద్దఎత్తున టెస్టులు చేస్తున్నారు.
- వివిధ దేశాల్లో కరోనా వ్యాప్తి కొనసాగుతూనే ఉంది. ప్రపంచవ్యాప్తంగా కొత్తగా 6,73,225కేసులు నమోదవ్వగా.. మొత్తం కేసుల సంఖ్య 79,722,353కి చేరింది. మొత్తం 11,800 కొవిడ్ ధాటికి ప్రాణాలు కోల్పోగా.. 56,116,095 మంది కోలుకున్నారు.
- అమెరికాలో కరోనా వైరస్ ఉద్ధృతి కొనసాగుతోంది. అక్కడ కొత్తగా 193,030 మందికి పాజిటివ్‌గా వచ్చింది. దీంతో కేసుల సంఖ్య కోటీ 91లక్షలకు చేరింది. ఇక 2,835 మంది కరోనాతో మరణించగా.. మొత్తం మృతుల సంఖ్య 3లక్షల 37వేలకు చేరింది.
- బ్రెజిల్నూ కరోనా భయం వీడటం లేదు. కొత్తగా 58,916 కరోనా కేసులు వెలుగు చూశాయి. మొత్తం కేసుల సంఖ్య 74లక్షలకు పెరిగింది. వైరస్‌తో 768 మంది ప్రాణాలు కోల్పోగా.. మొత్తం మరణాల సంఖ్య 1.90లక్షలు దాటింది.
ఇదీ చదవండి:'అందరి చూపు కొవాగ్జిన్ టీకా వైపే'