తెలంగాణ

telangana

శ్రీలంక అధ్యక్షుడిగా 'గోటబాయ రాజపక్స' ప్రమాణం

By

Published : Nov 18, 2019, 3:12 PM IST

శ్రీలంక అధ్యక్షుడిగా గోటబాయ రాజపక్స ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమానికి గోటబాయ సోదరుడు, శ్రీలంక మాజీ అధ్యక్షుడు మహీంద రాజపక్సతో పాటు పలువురు నేతలు హాజరయ్యారు. ఇటీవల జరిగిన అధ్యక్ష ఎన్నికల్లో 13 లక్షలకుపైగా ఓట్ల తేడాతో గెలుపొందారు గోటబాయ.

శ్రీలంక అధ్యక్షుడిగా 'గోటబాయ రాజపక్స' ప్రమాణం

శ్రీలంక దేశానికి ఏడో అధ్యక్షుడిగా గోటబాయ రాజపక్స ప్రమాణ స్వీకారం చేశారు. చారిత్రక నేపథ్యం కలిగిన అనురాధపురలోని రువాన్వేలి సేయా ఆవరణలో శ్రీలంక ద్వీప దేశాధ్యక్షుడిగా గోటబాయ ప్రమాణం చేశారు. ప్రజలు తనపై పెట్టుకున్న ఆకాంక్షలను నెరవేరుస్తానన్నారు రాజపక్స.

'టెర్మినేటర్​' పాలన..

ప్రమాణ స్వీకార వేడుకల్లో గోటబాయ సోదరుడు, శ్రీలంక మాజీ అధ్యక్షుడు మహీంద రాజపక్స, మాజీ మంత్రి బాసిల్ రాజపక్స, పార్లమెంటు సభ్యులు పాల్గొన్నారు. ప్రజలు ముద్దుగా టెర్మినేటర్‌ అని పిలుచుకునే గోటబాయ.. అధ్యక్ష ఎన్నికల్లో 52శాతం ఓట్లతో విజయం సాధించారు.

ABOUT THE AUTHOR

...view details