తెలంగాణ

telangana

By

Published : Feb 7, 2020, 8:56 PM IST

Updated : Feb 29, 2020, 1:49 PM IST

ETV Bharat / international

కరోనా ఎఫెక్ట్​: ప్రపంచ వ్యాప్తంగా మాస్క్​ల కొరత

కరోనా రోజురోజుకూ విస్తరిస్తున్న నేపథ్యంలో ప్రపంచ వ్యాప్తంగా మాస్క్​ల కొరత ఏర్పడింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్​ఓ) డైరక్టర్​ జనరల్​ టెడ్రోస్​ అధనామ్​ ఇదే విషయాన్ని స్పష్టం చేశారు. ఇప్పటి వరకు ఈ వైరస్​ ధాటికి చైనాలో 636 మంది మృతి చెందినట్లు అధికారులు తెలిపారు.

Global shortage of anti-virus masks: WHO chief
కరోనా ఎఫెక్ట్​: ప్రపంచ వ్యాప్తంగా మాస్క్​ల కొరత

ప్రపంచ వ్యాప్తంగా పలు దేశాలను బయపెడుతోంది కరోనా వైరస్​. ఈ వైరస్​ ఒకరి నుంచి మరొకరికి వ్యాప్తి చెందకుండా ఉండేందుకు మాస్క్​లను ధరించాలని వైద్యుల సూచించారు. అందువల్ల ప్రస్తుతం చాలా మంది మస్క్​లు ధరిస్తున్నారు. కొన్ని దేశాల్లో మాస్క్​ల కోసం గంటలపాటు క్యూలైన్లో నిలబడి మరీ కొంటున్నారు. ఈ నేపథ్యంలో ప్రపంచ వ్యాప్తంగా మాస్క్​ల కొరత ఏర్పడిందని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్​ఓ) ప్రకటించింది.

"ప్రస్తుతం ప్రపంచం మాస్క్​ల కొరతతో ఇబ్బందులు ఎదుర్కొంటోంది."
-టెడ్రోస్ అధనామ్ ఘెబ్రేయేసస్ డబ్ల్యూహెచ్​ఓ డైరెక్టర్​ జనరల్​.

మొత్తం 636 మంది..

చైనాలో కరోనా బారిన పడి మరణించిన వారి సంఖ్య 636కు చేరింది. గురువారం ఒక్కరోజే 73 మంది మరణించినట్లు అధికారులు తెలిపారు. మరో 31,000 మందికి పైనే ఈ వైరస్‌ సోకినట్లు వెల్లడించారు. ఇప్పటి వరకు వ్యాధి నుంచి కోలుకుని 1,540 మంది ఆస్పత్రి నుంచి డిశ్చార్జి​ అయ్యారు.

జపాన్‌ నౌకలో 41 మందికి...

జపాన్‌లోని యొకోహామా తీరానికి చేరిన ‘డైమండ్‌ ప్రిన్సెస్‌’ విహార నౌకలో మరో 41 మందికి కరోనా సోకినట్లు గుర్తించారు. ఫలితంగా నౌకలో వైరస్‌ బారిన పడిన వారి సంఖ్య 61కి చేరింది. నౌకలో మొత్తం 3,711 మంది ప్రయాణికులున్నారు.

ఇదీ చూడండి: నిర్భయ కేసు: తీహార్​ జైలు అధికారుల పిటిషన్​ కొట్టివేత

Last Updated : Feb 29, 2020, 1:49 PM IST

ABOUT THE AUTHOR

...view details