తెలంగాణ

telangana

ETV Bharat / international

కరోనా పంజా.. 6 లక్షలకు చేరువైన మరణాలు - రష్యాలో కరోనా కేసులు

ప్రపంచవ్యాప్తంగా కరోనా ఉద్ధృతి ఏ మాత్రం తగ్గడం లేదు. రోజూ లక్షల్లో కొత్త కేసులు వెలుగు చూస్తున్నాయి. మొత్తం కేసుల సంఖ్య కోటీ 37 లక్షలు దాటింది. 5.87 లక్షల మందికిపైగా మరణించారు. అమెరికా, బ్రెజిల్​, రష్యా, మెక్సికో, దక్షిణాఫ్రికా తదితర దేశాల్లో వైరస్​ విజృంభిస్తోంది.

Global COVID-19 tracker
కరోనా పంజా.. 6 లక్షలకు చేరువైన మరణాలు

By

Published : Jul 16, 2020, 6:00 PM IST

కరోనా తన విస్తృతిని పెంచుకుంటూపోతోంది. ప్రపంచదేశాల్లో ఇప్పటివరకు కోటీ 37 లక్షల 28 వేల మందికిపైగా కరోనా సోకింది. మరో 5.87 లక్షలకుపైగా వైరస్​ ధాటికి బలయ్యారు. 81 లక్షల 78 వేల మంది ఆసుపత్రుల నుంచి ఇంటికి చేరుకున్నారు.

రోజూ 6 వేలకుపైనే..

రష్యాలో కరోనా మహమ్మారి విజృంభిస్తూనే ఉంది. రోజూ 6 వేలకుపైగా కొత్త కేసులు నమోదవుతున్నాయి. తాజాగా 6,428 మంది కొవిడ్​ బారినపడ్డారు. దీంతో మొత్తం కేసుల సంఖ్య 7,52,797కు చేరింది. మరో 167 మరణాలతో మొత్తం మృతుల సంఖ్య 11,937కు చేరింది.

ఆ దేశంలో 37 వేల మంది మృతి..

మెక్సికోలో కరోనా విలయతాండవం చేస్తుంది. ఇవాళ మరో 6,149 కేసులు వెలుగుచూశాయి. దేశవ్యాప్తంగా మొత్తం కేసులు 3 లక్షల 17 వేలు దాటాయి. దాదాపు 37 వేల మంది మృతి చెందారు.

⦁ ఇరాన్​లో మళ్లీ కరోనా విజృంభిస్తోంది. తాజా 2,500 కేసులు.. 198 మరణాలు నమోదయ్యాయి. మొత్తం 2,67,061 మంది బాధితులు ఉన్నట్లు అధికారులు వెల్లడించారు.

⦁ పాకిస్థాన్​లో​ గురువారం 2,145 మందికి వైరస్​ పాజిటివ్​గా తేలింది. మొత్తం కేసుల సంఖ్య 2,57,914కు, మరణాలు 5,426కు చేరాయి.

⦁ సింగపూర్​లో తాజాగా 248 మందికి వైరస్​ సోకింది. వీరిలో 237 కేసులు విదేశీ కార్మికులే. మొత్తం కేసులు 47,126కు చేరాయి. ఇప్పటివరకు 27 మంది చనిపోయారు.

⦁ నేపాల్​లో కరోనా మహమ్మారి వేగంగా వ్యాప్తి చెందుతోంది. 167 కొత్త కేసులు నమోదయ్యాయి. మొత్తం 39 మంది వైరస్​ సోకి మృత్యువాతపడ్డారు.

⦁ బంగ్లాదేశ్​లో తాజాగా నమోదైన కేసులతో కలిపి ఇప్పటి వరకు 1,96,323 మంది బాధితులు ఉన్నట్లు ఆ దేశ ఆధికారులు తెలిపారు. ఫలితంగా 2,496 మంది వైరస్​కు బలయ్యారు.

దేశం కేసులు మరణాలు
అమెరికా 36,18,739 1,40,172
బ్రెజిల్ 19,72,072 75,568
రష్యా 7,52,797 11,937
పెరూ 3,37,724 12,417
చిలీ 3,21,205 7,186
మెక్సికో 3,17,635 36,906
దక్షిణాఫ్రికా 3,11,049 4,453
స్పెయిన్ 3,04,574 28,413

ABOUT THE AUTHOR

...view details