తెలంగాణ

telangana

ETV Bharat / international

కరోనా పంజా: హాంకాంగ్​లో స్కూల్స్​ బంద్​​- ఇరాక్​లో రీఓపెన్​

ప్రపంచవ్యాప్తంగా మొత్తం కరోనా​ బాధితుల సంఖ్య 6 కోట్ల 27 లక్షలు దాటింది. మహమ్మరి ధాటికి ఇప్పటివరకు 14 లక్షల 60 మందికిపై మృతి చెందారు. కరోనా నేపథ్యంలో హాంకాంగ్​లో పాఠశాలలను మూసివేయగా.. ఇరాక్​లో చాలా రోజుల తర్వాత విద్యాసంస్థలు తెరుచుకున్నాయి.

Global Covid-19 cases updates
హాంకాంగ్​లో స్కూల్స్​ క్లోజ్​- ఇరాక్​లో రీఓపెన్​

By

Published : Nov 29, 2020, 9:00 PM IST

ప్రపంచదేశాల్లో కరోనా ఉద్ధృతి కొనసాగుతోంది. ఫలితంగా మొత్తం కొవిడ్​​ కేసుల సంఖ్య 6 కోట్ల 27 లక్షల 29వేలు దాటింది. ఇప్పటివరకు వైరస్​కు బలైనవారి సంఖ్య 14 లక్షల 61 వేలకు చేరువైంది. అయితే 4 కోట్ల 33 లక్షల 36 వేలమందికిపైగా మహమ్మారి నుంచి జయించారు.

హంకాంగ్​లో మూతబడిన పాఠశాలలు

హాంకాంగ్​లో కొత్తగా 115 కేసులు నమోదవగా.. పాఠశాలలు మూసివేస్తూ నిర్ణయం తీసుకుంది అక్కడి ప్రభుత్వం. ఆగస్టు 2 తర్వాత మూడంకెల సంఖ్యలో కొవిడ్​ కేసులు వెలుగుచూడటం ఇదే తొలిసారి.

బ్రిటన్​లో టైర్​బేస్డ్​​ లాక్​డౌన్​!

బ్రిటన్​లో కరోనా కేసులు పెరుగుతున్న వేళ వైరస్​ తీవ్రత ఆధారంగా(టైర్​బెస్డ్)​ లాక్​డౌన్​ విధించాలన్న ఆ దేశ ప్రధాని బోరిస్​ జాన్సన్​ నిర్ణయంపై మంగళవారం ఓటింగ్​ జరగనుంది. ఈ మేరకు తన పార్టీ నేతలకు లేఖ రాశారు జాన్సన్​. ప్రధాని నిర్ణయానికి చట్టసభ్యులు ఆమోదం తెలిపితే.. ఆయా ప్రాంతాల్లో టైర్​బేస్డ్​ లాక్​డౌన్​ విధిస్తారు.

రెండోదశ

రానున్న సెలవు రోజుల్లో కఠిన నిబంధనలు అమలు చేయకపోతే రెండోదశలో కరోనా విస్తరించవచ్చని అక్కడి అధికారులను హెచ్చరిస్తున్నారు నిపుణులు.

  • ఇరాక్​లో కరోనా తీవ్రత తగ్గుముఖం పట్టిన నేపథ్యంలో అక్కడి పాఠశాలలను తెరిచారు.
  • రష్యాలో తాజాగా 26,683 మంది కరోనా బారిన పడ్డారు. మరో 459మంది మరణించారు.
  • ఇరాన్​లో కొత్తగా 12,950 కేసులు వెలుగుచూశాయి. 389మంది చనిపోయారు.
  • మెక్సికోలో ఒక్కరోజే 10 వేలు కేసులు నమోదవగా.. 586మంది మృతి చెందారు.
  • పోలండ్​లో తాజాగా 11,483 మందికి కరోనా సోకగా.. 283 మంది ప్రాణాలు కోల్పోయారు.
దేశం మొత్తం కేసులు మొత్తం మరణాలు
రష్యా 22,69,316 39,527
ఫ్రాన్స్​ 22,08,699 52,127
మెక్సికో 11,00,683 105,459
జర్మనీ 10,44,475 16,410
పోలండ్​ 9,85,075 17,029

ఇదీ చూడండి:కరోనా పుట్టింది భారత్​లోనే: చైనా

ABOUT THE AUTHOR

...view details