ప్రపంచంలో 6 కోట్లు దాటిన కరోనా కేసులు - covid cases worldwide
ప్రపంచవ్యాప్తంగా మొత్తం కేసుల సంఖ్య 6 కోట్లు దాటింది. రోజూ 5లక్షల కేసులు నమోదవుతున్నాయి. ఈ క్రమంలో పాజిటివ్ కేసులు భారీగా పెరుగుతున్నాయి.
ప్రపంచంలో 6కోట్ల దాటిన కరోనా కేసులు
By
Published : Nov 25, 2020, 10:52 PM IST
ప్రపంచవ్యాప్తంగా కరోనా తీవ్రత కొనసాగుతూనే ఉంది. రోజూ కొత్తగా దాదాపు 5లక్షల కేసులు బయటపడుతున్నాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 6 కోట్ల 4 లక్షలకు చేరువైంది. 14లక్షల 20వేల మందికిపైగా మరణించారు. కరోనా సోకిన మొత్తం బాధితుల్లో ఇప్పటివరకు 4కోట్ల 20లక్షల మంది కోలుకున్నారు. మరో కోటి 72లక్షల క్రియాశీల కేసులున్నాయి.
అమెరికాలోని కొవిడ్ కేసులు భారీగా నమోదవుతున్నాయి. ఇప్పటివరకు కోటి 29 లక్షలకుపైగా వైరస్ కేసులు నమోదవగా.. మరణించిన వారిసంఖ్య 2 లక్షల 66 వేల మందికిపైగా మరణించారు.
రెండో స్థానంలో ఉన్న భారత్‌లో కేసుల సంఖ్య 92లక్షలు దాటగా.. లక్షా 35వేల మంది ప్రాణాలు కోల్పోయారు. వీటితో పాటు దక్షిణ అమెరికా, ఐరోపా దేశాల్లో వైరస్ విజృంభణ కొనసాగుతూనే ఉంది. ముఖ్యంగా బ్రెజిల్, మెక్సికో, యూకే, ఇటలీ, ఫ్రాన్స్ దేశాల్లో వైరస్ తీవ్రత ఎక్కువగా ఉంది. రెండో దఫా విజృంభణతో ఐరోపాలోని కొన్ని దేశాలు మరోసారి లాక్‌డౌన్ ఆంక్షలను అమలు చేస్తున్నాయి.