తెలంగాణ

telangana

ETV Bharat / international

ప్రపంచవ్యాప్తంగా లక్షా 10వేలు దాటిన కరోనా కేసులు

ఇప్పటికే 100 దేశాలకు విస్తరించిన కరోనా.. 3వేల 800 మందిని బలిగొంది. తాజాగా వైరస్​ కేసుల సంఖ్య ఒక లక్షా పదివేలకు చేరింది. ఇరాన్​లో ఒక్కరోజే 43మంది కరోనాతో మరణించారు. వైరస్​ వ్యాప్తి నేపథ్యంలో పలు విమానయాన సంస్థలు.. కరోనా ప్రభావిత దేశాల్లో తమ సేవలు నిలిపివేశాయి.

Global coronavirus cases passes 110,000 and Qatar bans entry of people from India, 13 other countries
ప్రపంచవ్యాప్తంగా లక్షా 10వేలు దాటిన కరోనా కేసులు

By

Published : Mar 9, 2020, 6:55 PM IST

Updated : Mar 9, 2020, 10:48 PM IST

ప్రపంచవ్యాప్తంగా లక్షా 10వేలు దాటిన కరోనా కేసులు

ప్రపంచదేశాలను కరోనా వైరస్​ భయపెడుతూనే ఉంది. వైరస్​ లక్షణాలతో ప్రపంచవ్యాప్తంగా లక్షా 10వేలకు పైగా కేసులు నమోదయ్యాయి. ఇప్పటి వరకు సుమారు 100 దేశాలకు కరోనా విస్తరించింది. 3వేల 800కుపైగా మందిని బలితీసుకుంది.

ఇరాన్​లో...

ఇరాన్​వాసులను కరోనా తీవ్రంగా కలవరపెడుతోంది. తాజాగా మరో 43మంది వైరస్​తో ప్రాణాలు కోల్పోయారు. ఫలితంగా మృతుల సంఖ్య 237కు చేరింది. 595 కొత్త కేసులతో సహా మొత్తం 7,167మందికి కోవిడ్​-19 సోకినట్లు ఆ దేశ ఆరోగ్య శాఖ ప్రకటించింది. అయితే ఇప్పటివరకు దాదాపు 2,394 మంది కరోనా నుంచి కోలుకున్నట్టు తెలిపింది.

విమానాలు రద్దు..

వైరస్​ వ్యాప్తి నేపథ్యంలో భారత్​ సహా 13 దేశాలకు రాకపోకలను నిలిపివేసింది ఖతార్​ విమానయాన సంస్థ. ఇందులో కరోనా ప్రభావం అత్యధికంగా ఉన్న చైనా, ఇటలీ, ఇరాన్​, ఇరాక్​, ఈజిప్ట్​, నేపాల్​, పాకిస్థాన్​, ఫిలిప్పిన్స్​, దక్షిణ కొరియా, శ్రీలంక, బంగ్లాదేశ్​, థాయ్​లాండ్​ దేశాలున్నాయి.

అయితే భారత ప్రయాణికులు రాజధాని దోహా విమానాశ్రయం కేంద్రంగా కనెక్టింగ్​ ఫ్లైట్లను ఉపయోగించుకోవచ్చని స్పష్టం చేసింది ఖతార్​. ఇప్పటికే టికెట్లు బుక్​ చేసుకున్నవారికి పూర్తి డబ్బును తిరిగి చెల్లించేస్తామని స్పష్టం చేసింది.

ఈ నేపథ్యంలో భారత విమానయాన సంస్థ ఇండిగో.. మార్చ్​ 17 వరకు ఖతార్​కు విమానాలు రద్దు చేసింది. గోఎయిర్, ఎయిర్​ ఇండియా సంస్థలు సైతం సేవలను నిలిపివేసే అవకాశాలు కనిపిస్తున్నాయి.

ఇదీ చదవండి:ప్రభుత్వ నిఘా నడుమ ఘనంగా 'అట్టుకల్' వేడుకలు

Last Updated : Mar 9, 2020, 10:48 PM IST

ABOUT THE AUTHOR

...view details