తెలంగాణ

telangana

ETV Bharat / international

టర్కీపై కరోనా పంజా- ఒక్కరోజే 30,110 కేసులు - COVID deaths

ప్రపంచవ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య 6 కోట్ల 38 లక్షలు దాటింది. కొవిడ్​ ధాటికి ఇప్పటివరకు 14 లక్షల 80వేల మంది మృతి చెందారు. అమెరికా, ఐరోపా దేశాల్లో వైరస్​ ప్రభావం తీవ్రంగా ఉంది.

Global coronavirus cases and deaths updates
టర్కీలో కరోనా పంజా- ఒక్కరోజే 30,110 కేసులు

By

Published : Dec 1, 2020, 11:18 PM IST

ప్రపంచదేశాల్లో కరోనా తీవ్రత రోజురోజుకూ పెరుగుతోంది. గడిచిన కొన్ని రోజులుగా రోజూ సగటున 5 లక్షల కేసులు బయటపడుతున్నాయి. ఫలితంగా మొత్తం కేసుల సంఖ్య 6 కోట్ల 38 లక్షల 74 వేలు దాటింది. ఇప్పటివరకు కొవిడ్​తో మరణించిన వారి సంఖ్య 14 లక్షల 80 వేలకు చేరింది.

ప్రపంచంలోనే అత్యధికంగా అమెరికాలో వైరస్​ కేసులు నమోదవుతున్నాయి. రష్యా, ఇటలీ, బ్రిటన్, ఇరాన్​ సహా పలు దేశాల్లోనూ కొవిడ్​ కేసులు భారీ సంఖ్యలో బయటపడుతున్నాయి.

  • టర్కీలో కరోనా బాధితులు భారీగా పెరుగుతున్నారు. ఒక్కరోజే 30,110 కేసులు బయటపడ్డాయి. మరో 190 మంది చనిపోయారు.
  • రష్యాలో కొత్తగా 26 వేల 402 మంది కొవిడ్ బారిన పడ్డారు. మరో 569 మంది మరణించారు.
  • ఇటలీలో తాజాగా 19,350 మందికి కరోనా సోకగా.. 785 మందిని వైరస్ బలి తీసుకుంది.
  • బ్రిటన్​లో ఒక్కరోజే 13,430 కేసులు వెలుగుచూశాయి. మరో 603మంది ప్రాణాలు కోల్పోయారు.
  • ఇరాన్​లో 13,881 మందికి వైరస్​ సోకింది. 382 మరణించారు.
దేశం మొత్తం కేసులు మొత్తం మరణాలు
బ్రెజిల్​ 63,44,345 1,73,229
రష్యా 23,22,056 40,464
బ్రిటన్​ 16,43,086 59,051
ఇటలీ 16,20,901 56,361
మెక్సికో 11,13,543 1,05,940

ఇదీ చూడండి:కన్న కొడుకుని 28ఏళ్లపాటు నిర్బంధించిన తల్లి!

ABOUT THE AUTHOR

...view details