తెలంగాణ

telangana

By

Published : Apr 29, 2020, 7:35 PM IST

ETV Bharat / international

లాక్​డౌన్​ ముగింపునకు ముందు మళ్లీ కరోనా ఉద్ధృతి

ప్రపంచవ్యాప్తంగా కరోనా కేసులు, మృతుల సంఖ్య రోజురోజుకు పెరుగుతున్నాయి. సింగపూర్​లోని విదేశీ కార్మికులు భారీ సంఖ్యలో వైరస్​ బారినపడ్డారు. స్పెయిన్​లో ఆర్థిక వ్యవస్థ పునరుద్ధరణవైపు ప్రభుత్వం అడుగులు వేస్తున్న తరుణంలో.. రోజువారీ మరణాల సంఖ్య పెరగడం తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది.

GLOBAL CORONA VIRUS DEATH IS SET TO REACH 2,20,000
2లక్షల 20వేలకు చేరువలో కరోనా మరణాలు

ప్రపంచవ్యాప్తంగా కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. ఇప్పటివరకు 31లక్షల 60వేల 779మందికి వైరస్​ సోకింది. మొత్తం 2లక్షల 19వేల 258మంది ప్రాణాలు కోల్పోయారు.

దేశం కేసులు మృతులు
అమెరికా 10,35,765 59,266
స్పెయిన్​ 2,36,899 24,275
ఇటలీ 2,01,505 27,359
ఫ్రాన్స్​ 1,65,911 23,660
బ్రిటన్​ 1,61,145 21,678
జర్మనీ 1,60,059 6,314
రష్యా 99,399 972
ఇరాన్​ 93,657 5,957
చైనా 82,858 4,633

స్పెయిన్​లో మళ్లీ...

స్పెయిల్​లో రోజువారీ మరణాల సంఖ్య మళ్లీ పెరిగింది. తాజాగా 325మంది వైరస్​ సోకి ప్రాణాలు కోల్పోయారు. దీంతో ఆ దేశంలో మృతుల సంఖ్య 24వేల 275కు చేరింది.

అయితే స్పెయిన్​లో డీలా పడ్డ ఆర్థిక వ్యవస్థను గాడిపెట్టేందుకు ప్రభుత్వ యంత్రాంగం ప్రణాళికలు రచిస్తోంది. ఈ శనివారం నుంచి వ్యక్తిగత కార్యకలాపాలు ప్రారంభమవుతాయి. అపాయింట్​మెంట్​ ఉన్న వారే క్షవరం​ వంటి పనుల కోసం ఇంటి నుంచి బయటకు రావాల్సి ఉంటుంది. మే 11 తర్వాతే ఇతర దుకాణాలు తెరుచుకుంటాయి. సామాజిక దూరం వంటి నిబంధనలతో కేఫ్​లు, బార్లు పనిచేస్తాయి. మూడింట ఒకవంతు వారికే చర్చిలు, మసీదుల్లో ప్రార్థనలకు అనుమతినిస్తారు.

సింగపూర్​లో ఆందోళనకరంగా...

సింగపూర్​లో పరిస్థితులు కొంతమేర ఆందోళనకరంగా ఉన్నాయి. కేసుల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. వీరిలో చాలామంది విదేశీ కార్మికులే ఉండటం గమనార్హం. తాజాగా మరో 690 కేసులు నమోదయ్యాయి. వీరిలో కేవలం ఆరుగురు సింగపూర్​ వాసులు ఉన్నారు. మొత్తం కేసుల సంఖ్య 15వేల 641కి చేరింది. వీరిలో 12,183మంది విదేశీ కార్మికులే.

పాకిస్థాన్​లోనూ...

పాకిస్థాన్​లో ఇప్పటివరకు 14వేల 885మంది వైరస్​ బారినపడ్డారు. మృతుల సంఖ్య 327కు చేరింది. 3,425మంది కోలుకోగా.. 129మంది పరిస్థితి అత్యంత విషమంగా ఉంది.

మంగళవారం ఒక్కరోజే వేల 530మందికి కరోనా పరీక్షలు నిర్వహించారు. ఇప్పటివరకు దేశవ్యాప్తంగా 1,65,911మందికి పరీక్షలు చేశారు.

అయితే రాజకీయ నేతలు కూడా వైరస్​ బారినపడటం పాక్​లో తీవ్ర కలకలం రేపుతోంది. తాజాగా సింధ్​ రాష్ట్రం అసెంబ్లీలోని ముఖ్య నేత రాణా హమీర్​కు వైరస్​ సోకినట్టు నిర్ధరణ అయ్యింది.

ABOUT THE AUTHOR

...view details