తెలంగాణ

telangana

ETV Bharat / international

అమెరికాలో కరోనా ఉద్ధృతి.. 55 లక్షలు దాటిన కేసులు

ప్రపంచదేశాల్లో కరోనావైరస్ ఉగ్రరూపం దాల్చుతోంది. గడిచిన 24 గంటల్లో 2.48 లక్షల కేసులు బయటపడ్డాయి. మొత్తం బాధితుల సంఖ్య రెండు కోట్ల 16 లక్షల మార్క్ అధిగమించింది. మొత్తం మృతుల సంఖ్య 7.68 లక్షలకు పెరిగింది. అమెరికా, బ్రెజిల్​లో కరోనా తీవ్రత కొనసాగుతోంది.

GLOBAL CORONA TRACER
కరోనా పంజా.. అమెరికాలో మరో 53 వేల మందికి కరోనా

By

Published : Aug 16, 2020, 7:51 AM IST

ప్రపంచవ్యాప్తంగా కరోనా తాండవం చేస్తోంది. రోజురోజుకూ కేసులు, మరణాల సంఖ్య అంతకంతకూ పెరుగుతూనే ఉన్నాయి. అమెరికా, బ్రెజిల్​, రష్యా, సౌతాఫ్రికా దేశాల్లో వైరస్​ విజృంభణ కొనసాగుతోంది..

అమెరికాలో వెయ్యి మంది మృతి..

అమెరికాలో కరోనా కరాళ నృత్యం చేస్తోంది. తాజాగా మరో 53,523 మందికి వైరస్​ సోకగా, మొత్తం 55,29,789 మంది కరోనా బారినపడ్డారు. లక్షా 73 వేల మంది మరణించారు. గడిచిన 24 గంటల్లో 1,071 మంది వైరస్ కారణంగా ప్రాణాలు కోల్పోయారు.

33 లక్షలు దాటిన కేసులు

బ్రెజిల్​లో కరోనావైరస్ అంతకంతకూ విజృంభిస్తోంది. తాజాగా 38,937 మంది కరోనా బారిన పడ్డట్లు అధికారులు తెలిపారు.. మొత్తం కేసుల సంఖ్య 33 లక్షల 17 వేలకు చేరింది. మరో 726 మంది బాధితులు కొవిడ్​ ధాటికి మృతి చెందగా.. మరణాల సంఖ్య 1,07,297కు చేరింది.

రష్యాలో 5 వేల కేసులు

రోజువారీగా నమోదవుతున్న కేసుల సంఖ్య స్థిరంగా ఉన్నప్పటికీ రికవరీలు పెరుగుతుండటం రష్యాకు సానుకూల పరిణామంగా కనిపిస్తోంది. కొత్తగా 5 వేల మందికి కరోనా సోకినట్లు తేలింది. మొత్తం కేసుల సంఖ్య 9 లక్షల 17 వేలకు చేరింది. వీరిలో 7.29 లక్షల మంది కోలుకున్నారు. 121 మంది మృతి చెందడం వల్ల మరణాల సంఖ్య 15,617కు పెరిగింది.

  • మెక్సికోలో తాజాగా నమోదైన కేసులతో కలిపి మొత్తం 5.11 లక్షల మంది వైరస్​ బారిన పడ్డారు. మరో 615 మంది మృతి చెందగా.. దాదాపు 56 లక్షల మంది ప్రాణాలు కోల్పోయారు.
  • దక్షిణాఫ్రికాలో కరోనా కేసులు పెరుగుతున్నాయి. తాజాగా 4,513 కేసులు గుర్తించారు. 121 మంది మృతిచెందారు. దేశవ్యాప్తంగా మొత్తం బాధితుల సంఖ్య 5,83,653కు ఎగబాకింది. ఫలితంగా 11,677 మంది ప్రాణాలు విడిచారు.

పలు దేశాల్లో కరోనా కేసుల వివరాలు ఇలా...

దేశం కేసులు మరణాలు
అమెరికా 55,29,789 1,72,606
బ్రెజిల్ 33,17,832 1,07,297
రష్యా 9,07,758 15,617
దక్షిణాఫ్రికా 5,83,653 11,677
మెక్సికో 5,11,369 55,908
పెరూ 5,16,296 25,856

ABOUT THE AUTHOR

...view details