తెలంగాణ

telangana

ETV Bharat / international

రష్యా, మెక్సికోలో తగ్గని కరోనా ఉద్ధృతి - singapore corona news

ప్రపంచవ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య కోటీ 75 లక్షలు దాటింది. 6 లక్షల 77వేల మందికిపైగా వైరస్​కు బలయ్యారు. వైరస్ ప్రభావం తీవ్రంగా ఉన్న రష్యా, మెక్సికోలో వేల సంఖ్యలో కొత్త కేసులు నమోదవుతున్నాయి. సింగపూర్​లో మరో 396మంది వైరస్​ బారినపడ్డారు. ఇంగ్లాండ్​లో లాక్​డౌన్​ను కఠినతరం చేసింది ప్రభుత్వం.

global corona cases reaches 1.75 cr mark
ప్రపంచవ్యాప్తంగా కోటి 75లక్షలు దాటిన కరోనా కేసులు

By

Published : Jul 31, 2020, 7:27 PM IST

ప్రపంచంపై కరోనా మహమ్మారి కరాళ నృత్యం కొనసాగుతోంది. మొత్తం కేసుల సంఖ్య కోటీ 75లక్షల 14 వేలు దాటింది. ఇప్పటివరకు 6లక్షల 77వేల మందికిపైగా చనిపోయారు. వ్యాధి బారినపడిన వారిలో కోటీ 9లక్షల 69వేల మంది కోలుకున్నారు. 58లక్షల 68వేలకుపైగా యాక్టివ్​ కేసులున్నాయి.

  • వైరస్​ ప్రభావం అధికంగా ఉన్న రష్యాలో కొత్తగా 5,482 కేసులు నమోదయ్యాయి. మరో 161 మంది ప్రాణాలు కోల్పోయారు. దేశంలో మొత్తం కేసుల సంఖ్య 8,39,981కి చేరింది. మృతుల సంఖ్య 13,963కి పెరిగింది.
  • మెక్సికోలో మరో 7,730 మంది వైరస్​ బారినపడ్డారు. మొత్తం కేసుల సంఖ్య 4,16,179కి చేరగా.. ఇప్పటివరకు 46,000 మంది ప్రాణాలు కోల్పోయారు.
  • సింగపూర్​లో కొత్తగా 396 మందికి పాజిటివ్​గా తేలింది. వీరంతా విదేశాలకు చెందిన వారని ప్రభుత్వం తెలిపింది. దేశంలో మొత్తం కేసుల సంఖ్య 52,205కి పెరిగింది. మొత్తం 27మంది చనిపోయారు.
  • కరోనా మరోసారి విజృంభిస్తున్న నేపథ్యంలో పలు ప్రాంతాల్లో కఠిన ఆంక్షలతో లాక్​డౌన్​ విధించింది బ్రిటన్​ ప్రభుత్వం. ఈద్​ పండుగ నేపథ్యంలో ఎక్కువ మంది గుమిగూడకుండా చర్యలు చేపట్టింది. ఉత్తర ఇంగ్లాండ్​లో పూర్తిస్థాయి లాక్​డౌన్​ అమలు చేయనున్నట్లు ప్రకటించింది.

ABOUT THE AUTHOR

...view details