తెలంగాణ

telangana

ETV Bharat / international

గ్రహణానికి ముందు మెరిసిపోయిన చందమామ - super blood moon ఇండియా

సూపర్​ బ్లడ్​ మూన్​కు ముందు న్యూజిలాండ్​లో జాబిల్లి ప్రకాశవంతంగా మెరిసిపోయింది. గ్రహణం తర్వాత ఎరుపు, నారింజ రంగుల్లో చంద్రుడు వెలిగిపోనున్నాడు. ఈ గ్రహణం ఏ ప్రాంతాల వారికి కనిపిస్తుందంటే?

Glittering moon rises ahead of super blood moon
సూపర్ బ్లడ్ మూన్

By

Published : May 26, 2021, 3:24 PM IST

సూపర్ బ్లడ్ ​మూన్​ ఏర్పడటానికి ముందు న్యూజిలాండ్​లో నిండు జాబిల్లి కనువిందు చేసింది. గ్రహణం తర్వాత అరుణ వర్ణంతో చంద్రుడు మెరిసిపోనున్నాడు. 15 నిమిషాల పాటు సూపర్ బ్లడ్ మూన్ కనిపించనుంది.

న్యూజిలాండ్​లో నిండు చంద్రుడు

భారత కాలమానం ప్రకారం మధ్యాహ్నం 3.15 నిమిషాలకు చంద్ర గ్రహణం ప్రారంభమవుతుంది. సాయంత్రం 6.22 గంటల వరకు ఇది కొనసాగుతుంది. ఈ సమయంలో చంద్రుడు ఎరుపు, నారింజ రంగుల్లో కనిపించనున్నాడు. సూర్యుడి ప్రకాశం వల్ల ఈ రంగులు ఏర్పడనున్నాయి. భారత్​లో ఈ సంపూర్ణ చంద్రగ్రహణాన్ని తూర్పు, ఈశాన్య రాష్ట్రాల్లో చూసే అవకాశం ఉంది.

న్యూజిలాండ్​లో చందమామ

న్యూజిలాండ్​తో పాటు ఆస్ట్రేలియా, ఇతర పసిఫిక్, తూర్పు ఆసియా దేశాలలో సూపర్ బ్లడ్ మూన్​ను చూసే అవకాశం ఉంది. హవాయీ దీవులు, ఉత్తర అమెరికాల్లోని కొన్ని ప్రాంతాల్లో తెల్లవారుజామున ఇది కనిపించనుంది. అమెరికా తూర్పు తీర ప్రాంతాలు సహా ఐరోపా, ఆఫ్రికా పశ్చిమాసియా దేశాలు ఈ అద్భుతాన్ని చూసే అవకాశం లేదు.

ఇదీ చదవండి-బాంబులతో దాడి చేసి.. రూ.11లక్షలు చోరీ

ABOUT THE AUTHOR

...view details