చైనా నుంచి విముక్తి కోసం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మద్దతు కోరారు హాంకాంగ్ నిరసనకారులు. వేల మంది అమెరికా రాయబారి కార్యాలయం వద్దకు ర్యాలీగా వెళ్లారు. నల్లని దుస్తులు, ముసుగులు ధరించి, అమెరికా జెండాలను పట్టుకొని, హాంకాంగ్ నగరాన్ని కాపాడండి అంటూ నినాదాలు చేశారు. ఆందోళనకారులను అడ్డుకునేందుకు పోలీసులు ప్రయత్నించారు.చైనా నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా జరిగే యుద్ధంలో హాంకాంగ్‌కు మద్దతు ప్రకటించాలని నిరసనకారులు కోరారు.
గత వారమే నేరస్థలు అప్పగింత బిల్లును ఉపసంహరించుకుంటామని హాంకాంగ్ ప్రభుత్వం ప్రకటించింది. అయినా ఆందోళనకారులు వెనక్కితగ్గటం లేదు. మరికొన్ని డిమాండ్లను ప్రభుత్వం ముందు ఉంచారు. హాంకాంగ్‌ను చైనా నుంచి విడతీయటానికి విదేశీయులు, నేరస్థలు నిరసనకారులకు మద్దతు ఇస్తున్నారని చైనా అధికార పత్రికలు ప్రచురించాయి.