భారత్ నిరసనల మధ్య పాకిస్థాన్ ఆక్రమిత భూభాగమైన గిల్గిత్- బాల్టిస్థాన్లో అసెంబ్లీ ఎన్నికలు ముగిశాయి. కరోనా మార్గదర్శకాలను పాటిస్తూ.. ప్రజలు తమ ఓటుహక్కును వినియోగించుకున్నారు.
ఈ ప్రాంతంలో ఎన్నికలు జరపాలన్న పాక్ నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తోంది భారత్. కశ్మీర్ భూభాగంలో దాయాది దేశం చర్యలు తీసుకోవడానికి ఎలాంటి ఆధారాలు లేవంటూ.. తీవ్రస్థాయిలో నిరసన వ్యక్తం చేసింది.
కట్టుదిట్టమైన భద్రతా చర్యల నడుమ ఆదివారం ఉదయం 8 గంటలకు ప్రారంభమైన ఓటింగ్.. సాయంత్రం 5గంటలకు ముగిసింది. ఎలాంటి అంతరాయం కలుగకుండా సాగింది ఈ పోలింగ్. ఓట్ల లెక్కింపు ప్రాంభమవ్వగా.. సోమవారం ఫలితాలు వెలువడనున్నాయి.