తెలంగాణ

telangana

ETV Bharat / international

రహ్మాన్​కు గాంధీ పురస్కారంపై బంగ్లాదేశ్​ హర్షం - భారత్​ బంగ్లాదేశ్​ దౌత్య సంబంధాలు

బంగబంధు షేక్ ముజిబుర్ రహ్మాన్‌కు కేంద్ర సాంస్కృతిక శాఖ గాంధీ శాంతి పురస్కారం ప్రకటించింది. దీనిపై బంగ్లాదేశ్ స్పందించింది. ఈ అవార్డు తమకు భారత్​ ఇచ్చిన గౌరవంగా భావిస్తున్నట్లు తెలిపింది.

Gandhi peace prize to Sheikh Mujibur Rahman befitting tribute to New Delhi-Dhaka ties: Bangladesh
బంగబంధుకు గాంధీ శాంతి బహుమతి- బంగ్లాదేశ్​ హర్షం

By

Published : Mar 23, 2021, 10:33 AM IST

బంగబంధు షేక్ ముజిబుర్ రహ్మాన్‌కు ప్రతిష్టాత్మక గాంధీ శాంతి పురస్కారం ప్రకటించడాన్ని గౌరవంగా భావిస్తున్నట్లు బంగ్లాదేశ్ వెల్లడించింది. పరస్పరం సహకరించుకుంటున్న బంగ్లాదేశ్, భారత్ సంబంధాలకు ఇది తగిన గౌరవమని తెలిపింది.

ప్రపంచంలోని వివిధ రంగాల ప్రముఖులకు ఇచ్చే గాంధీ శాంతి పురస్కారాలను సోమవారం కేంద్ర సాంస్కృతిక శాఖ ప్రకటించింది. 2020 సంవత్సరానికి దివంగత బంగబంధు షేక్‌ ముజిబుర్‌ రహ్మాన్‌కు బహూకరించనున్నట్టు తెలిపింది. ఈ ఏడాదే బంగబంధు శత జయంతి ఉత్సవాలు జరగనుండడం గమనార్హం. పురస్కారం కింద కోటి రూపాయల నగదు, ప్రశంసా పత్రం, చేనేత వస్త్రాన్నిగానీ, సంప్రదాయ హస్త కళల వస్తువునుగానీ బహూకరిస్తారు.

హర్షం వ్యక్తం చేసిన మోదీ..

షేక్​ ముజిబుర్​ రహ్మాన్​కు బహుమతి ప్రకటించడంపై ప్రధాని నరేంద్ర మోదీ హర్షం వ్యక్తం చేశారు. ఉపఖండంలోని గొప్ప నాయకుల్లో రహ్మాన్​ ఒకరని కీర్తించారు.

కరోనా మహమ్మారి వ్యాప్తి తరువాత మోదీ మొదటగా బంగ్లాదేశ్​లో పర్యటించనున్నారు. ఈ నేపథ్యంలో అవార్డు ప్రకటించడం గమనార్హం.

ఇదీ చూడండి:ఆసియన్లపై దాడులు ఆపండి: ఐరాస​

ABOUT THE AUTHOR

...view details