అఫ్గానిస్థాన్లో దశాబ్దాలుగా కొనసాగుతున్న అంతర్యుద్ధానికి తెరదించే లక్ష్యంతో ఖతార్ దోహా వేదికగా తాలిబన్లతో శనివారం (సెప్టెంబర్ 12న) శాంతి చర్చలు చేపట్టింది ఆ దేశ ప్రభుత్వం. తాలిబన్లతో నేరుగా చర్చలు చేపట్టటం ఇదే తొలిసారి. అయితే.. చర్చలు చేపట్టిన మరుసటిరోజే అఫ్గాన్ సైన్యంపై పలు చోట్ల దాడులు జరిగాయి. శాంతి స్థాపన లక్ష్యాలకు తూట్లు పొడుస్తూ అఫ్గాన్ బలగాలే లక్ష్యంగా తాలిబన్లు దాడులు చేపట్టారు. ఈ ఘటనలతో ఇప్పట్లో చర్చలు కొలిక్కి వచ్చే పరిస్థితులు కనిపించటం లేదని తెలుస్తోంది.
దేశంలోని కాంధార్ రాష్ట్రంలో అఫ్గాన్ బలగాలే లక్ష్యంగా దాడులు జరిగాయి. ఈ ఘటనల్లో ఆరుగురు తాలిబన్లు హతమవగా.. పలువురు తీవ్రంగా గాయపడినట్లు ఆ దేశ మీడియా వెల్లడించింది. వైమానిక దాడుల ద్వారా అఫ్గాన్ బలగాలు ప్రతీకారం తీర్చుకున్నాయని అటల్ దళం ప్రతినిధి ఖ్వాజా తెలిపారు.
మరో రాష్ట్రంలో..