జమ్ముకశ్మీర్ వ్యవహారాన్ని అంతర్జాతీయ అంశంగా మార్చేందుకు మరోమారు విఫలయత్నం చేసింది చైనా. ఆర్టికల్ 370 రద్దు తర్వాత నెలకొన్న పరిస్థితులపై చర్చించాలని ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో ప్రతిపాదించగా.. దానిని వ్యతిరేకించనున్నట్లు ఫ్రాన్స్ ప్రకటించింది. ఈ అంశం.. ఈ రాత్రికి జరిగే సమావేశంలో ప్రస్తావనకు వచ్చే అవకాశం ఉండగా.. వ్యతిరేకిస్తామని ఫ్రాన్స్ తేల్చిచెప్పింది.
జమ్ముకశ్మీర్... భారత్-పాకిస్థాన్ల ద్వైపాక్షిక అంశమని, ఇతరుల జోక్యానికి తావులేదని పునరుద్ఘాటించింది ఫ్రాన్స్. ఫలితంగా చైనా ప్రయత్నం బెడిసికొట్టడం ఖాయమైంది.