చైనాలో ఆయిల్ ట్యాంకర్ పేలిన ఘటనలో నలుగురు మృతిచెందారు. మరో 50 మందికిపైగా గాయపడ్డారు.
ఉత్తర చైనా- ఝెజియాంగ్ రాష్ట్రంలో సంభవించిన ఈ ప్రమాదం వల్ల.. అక్కడి నివాసాలు, ఫ్యాక్టరీలు దెబ్బతిన్నాయి. ఫలితంగా తీవ్రస్థాయిలో నష్టం వాటిల్లింది. ప్రధాన రహదారిపై పేలుడు జరగడం వల్ల కార్లతోపాటు ఇతర వాహనాల్లోనూ మంటలు చెలరేగాయి.