ఆస్ట్రేలియాలోని డార్విన్ నగరంలో ఓ దుండగుడు జరిపిన కాల్పుల్లో నలుగురు ప్రాణాలు కోల్పోయారు. మరో ఇద్దరికి గాయాలయ్యాయి. కాల్పులకు తెగబడ్డ 45 ఏళ్ల దుండగుణ్ని అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు.
కాల్పుల నేపథ్యంలో ప్రజలను అప్రమత్తం చేశారు నగర పోలీసులు. నగరమంతా గట్టి భద్రత ఏర్పాటు చేశారు.