ఇండోనేషియాను మరోమారు భారీ భూకంపం కుదిపేసింది. మలుకు రాష్ట్రంలోని అంబన్ నగరంలో గురువారం 6.5 తీవ్రతతో భూమి కంపించింది. నగరంలోని పలు ప్రాంతాల్లో భవనాలు కుప్పకూలాయి. కొండచరియలు విరిగిపడ్డాయి. ఈ విపత్తు కారణంగా 20 మంది ప్రాణాలు కోల్పోయారు.
శిథిలాల కింద చిక్కుకున్నవారి కోసం సహాయక చర్యలు ముమ్మరం చేశారు అధికారులు. క్షతగాత్రులను సమీప ఆస్పత్రులకు తరలించారు. కూలిన భవనాల వద్ద తాత్కాలిక శిబిరాలను ఏర్పాటు చేసి ఆశ్రయం కల్పించారు.