అఫ్గాన్ మాజీ ఉపాధ్యక్షుడు అమ్రుల్లా సలేహ్ సోదరుడైన రోహుల్లా సలేహ్‌ను.. తాలిబన్లు చంపినట్లు తెలుస్తోంది. పంజ్‌షీర్‌ను పూర్తి నియంత్రణలోకి తీసుకున్న తాలిబన్లు.. అక్కడ నరమేధం సృష్టిస్తున్నారు. ఇంటింటి తనిఖీలు చేపట్టి తమ వ్యతిరేకులను, మైనార్టీలను చంపేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి.
అఫ్గాన్ మాజీ ఉపాధ్యక్షుడి సోదరుడిని చంపిన తాలిబన్లు! - అమ్రుల్లా సలేహ్
అఫ్గాన్ మాజీ ఉపాధ్యక్షుడు అమ్రుల్లా సలేహ్ సోదరుడు రోహుల్లా సలేహ్‌ను తాలిబన్లు చంపినట్లు వార్తలు వస్తున్నాయి. మరోవైపు పంజ్‌షీర్‌ను నియంత్రణలోకి తీసుకున్న తాలిబన్లు.. అక్కడ నరమేధం సృష్టిస్తున్నారు. స్థానికులు ప్రాణ భయంతో పంజ్‌షీర్‌ను వదిలి వెళ్తున్నారు.
అఫ్గాన్ మాజీ ఉపాధ్యక్షుడు సోదరుడిని చంపిన తాలిబన్లు
పంజ్‌షీర్‌లోని పలు ప్రాంతాల్లో రెసిస్టెన్స్ ఫోర్సెస్, తాలిబన్లకు మధ్య భీకర పోరు సాగుతోంది. ఈ దాడుల్లో ఇరు వర్గాలకు చెందిన అనేక మంది ప్రాణాలు కోల్పోయినట్లు అక్కడి ప్రజలు పేర్కొంటున్నారు. ప్రపంచమంతా తమకెందుకు సాయం చేయడంలేదని ప్రశ్నిస్తున్నారు.