తెలంగాణ

telangana

ETV Bharat / international

జమ్ముకశ్మీర్​ పునర్విభజనపై చైనా అక్కసు.. తిప్పికొట్టిన భారత్​ - latest news on kashmir

జమ్ముకశ్మీర్​ను రెండు కేంద్రపాలిత ప్రాంతాలుగా విభజించడంపై చైనా అభ్యంతరం వ్యక్తం చేసింది. భారత్​ తీసుకున్న నిర్ణయం చట్ట విరుద్ధమని ఆరోపించింది. అయితే డ్రాగన్​ దేశ ఆరోపణలను తిప్పికొట్టింది భారత్​. జమ్ముకశ్మీర్​, లద్దాఖ్​లను కేంద్రపాలిత ప్రాంతాలుగా చేసే నిర్ణయం పూర్తి స్థాయిలో భారత అంతర్భాగమేనని స్పష్టం చేసింది.

జమ్ముకశ్మీర్​ పునర్విభజనపై చైనా అక్కసు

By

Published : Oct 31, 2019, 5:56 PM IST

Updated : Oct 31, 2019, 11:48 PM IST

జమ్ముకశ్మీర్​ పునర్విభజనపై చైనా అక్కసు.. తిప్పికొట్టిన భారత్​

జమ్ముకశ్మీర్​కు ప్రత్యేక ప్రతిపత్తి కల్పించే అధికరణ 370 రద్దును మొదటి నుంచి వ్యతిరేకిస్తున్న చైనా.. రాష్ట్ర పునర్విభజన నిర్ణయంపై అభ్యంతరం వ్యక్తం చేసింది. కశ్మీర్​ను రెండు కేంద్రపాలిత ప్రాంతాలుగా చేయటం చట్టవిరుద్ధమని, అది చెల్లుబాటు కాదని ఆరోపించింది. చైనాలోని కొంత భూభాగాన్ని భారత్​ పరిపాలనలోకి చేర్చటం ద్వారా తమ దేశ సార్వభౌమత్వాన్ని భారత్​ సవాల్​ చేసిందని పేర్కొంది.

ఆగస్టు 5న జమ్ముకశ్మీర్​కు ప్రత్యేక ప్రతిపత్తి కల్పించే అధికరణ 370 రద్దు చేసి.. రాష్ట్రాన్ని రెండు కేంద్ర పాలిత ప్రాంతాలుగా చేస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అదే రోజు పార్లమెంట్ ఆమోదం పొందింది. నేటి నుంచి ఆ చట్టం అధికారింగా అమలులోకి వచ్చింది. ఈ నేపథ్యంలో చైనా తన అక్కసు వెల్లగక్కింది.

"జమ్ముకశ్మీర్​, లద్దాఖ్​ కేంద్రపాలిత ప్రాంతాల స్థాపనను భారత ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది. ఇందులో చైనాకు చెందిన కొంత భూభాగాలను భారత్​ పరిపాలన పరిధిలో చేర్చారు. చైనా దానిని ఖండిస్తోంది. గట్టిగా వ్యతిరేకిస్తోంది. చైనా సార్వభౌమత్వాన్ని సవాలు చేస్తూ.. భారత్​ తన దేశీయ చట్టాలను, పరిపాలన విభాగాన్ని ఏకపక్షంగా మార్చింది."

- జెంగ్​ షువాంగ్​, చైనా విదేశాంగ శాఖ ప్రతినిధి.

చైనా ప్రాదేశిక సార్వభౌమత్వాన్ని హృదయపూర్వకంగా గౌరవించాలని కోరారు జెంగ్​. ఇరు దేశాల మధ్య ఒప్పందాలకు కట్టుబడి ఉండాలని.. సరిహద్దు ప్రాంతాల్లో శాంతి, ప్రశాంతతను కాపాడాలని సూచించారు.

భారత్​ అంతర్భాగమే..

జమ్ముకశ్మీర్​పై చైనా వ్యాఖ్యలను తిప్పికొట్టింది భారత్​. రాష్ట్ర పునర్విభజన అంశం పూర్తిగా అంతర్గత విషయమని పునరుద్ఘాటించింది. ఇలాంటి విషయాలపై విదేశాలు మాట్లాడాల్సిన అవసరం లేదని పేర్కొంది. లద్దాఖ్​, జమ్ముకశ్మీర్​ ప్రాంతాల్లో భూభాగాన్ని చైనా ఆక్రమిస్తూనే ఉందని తెలిపింది.

ఇదీ చూడండి: అదిగో 'నవకశ్మీరం'.. రెండుగా మారిన 'హిమశిఖరం'

Last Updated : Oct 31, 2019, 11:48 PM IST

ABOUT THE AUTHOR

...view details