చైనాలో కరోనా ముప్పు తగ్గిన నేపథ్యంలో రాజధాని నగరంలోని చారిత్రక ఫర్బిడెన్ సిటీ సహా పార్కులు, మ్యూజియం వంటి పర్యటక స్థలాలు తెరుచుకున్నాయి. నాడు చైనా చక్రవర్తుల నివాసమైన ఫర్బిడెన్ సిటీలోకి రోజుకు 5,000మంది సందర్శకులను మాత్రమే అనుమతిస్తున్నారు. కరోనా వ్యాప్తికి ముందు ఒకే రోజులో 80,000 మంది ఈ పర్యటక స్థలాన్ని వీక్షించేవారు.
పార్కులకు ముందస్తు బుకింగ్..
పార్కుల్లోకి కూడా ప్రజలను అనుమతిస్తున్నారు చైనా అధికారులు. అయితే జన సంచారాన్ని నియంత్రించేందుకు సాధారణ రోజుల్లో వచ్చేవారి సంఖ్యలో 30 శాతం మందికి మాత్రమే పార్కుల్లోకి వెళ్లేందుకు అవకాశం కల్పిస్తున్నారు. ఆయా ప్రాంతాల్లో పర్యటించాలని అనుకునే వారు ఆన్లైన్లో ముందస్తు బుకింగ్ చేసుకోవాల్సి ఉంటుంది.