దక్షిణ చైనాలో వరదలు బీభత్సం సృష్టిస్తున్నాయి. వరదల కారణంగా మరో 14 మంది మృతి చెందారు. యాంగ్జీ నది ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. వరద నీరు గ్రామాల్లోకి రాకుండా సైనికులు, ఆ ప్రాంత ప్రజలు ఇసుక సంచులను అడ్డు వేస్తున్నట్లు అధికారులు వెల్లడించారు.
వరద ప్రవాహం ఎక్కువగా ఉన్నందున త్రీ గోర్జెస్ డ్యామ్ మూడు గేట్లను ఎత్తి.. నీటిని దిగువకు పారించారు. జలాశయంలో సాధారణ స్థాయిని మించి 15 మీటర్ల ఎత్తుకు నీరు చేరిందని పేర్కొన్నారు అధికారులు.
చాంగ్‌కింగ్ ప్రాంతంలో వరదల ధాటికి 11 మంది మరణించారు. ఇప్పటివరకు 1,031 ఇళ్లు నేలమట్టమవ్వగా, 20 వేల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. డున్హావో పట్టణంలో 39 సెంటీమీటర్లు వర్షపాతం నమోదైంది. కొండచరియలు విరిగిపడుతున్నాయి.