శ్రీలంకలో భారీ వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. వరదల కారణంగా నలుగురు చనిపోగా.. ఏడుగురు గల్లంతయ్యారు. 5 వేల మందికిపైగా నిరాశ్రయులయ్యారు. గురువారం రాత్రి నుంచి కురుస్తున్న వర్షాలతో శ్రీలంకలోని ఆరు జిల్లాల్లో ఇళ్లు, రహదారులు దెబ్బతిన్నాయి. పంటలు నీటమునిగాయి. వర్షాల కారణంగా 500 ఇళ్లు దెబ్బతినట్లు అధికారులు తెలిపారు.
శ్రీలంకలో భారీ వర్షాలు- నలుగురు మృతి! - శ్రీలంకను ముంచెత్తిన భారీ వర్షాలు
శ్రీలంకలో భారీ వర్షాలు ముంచెత్తాయి. వరదల కారణంగా నలుగురు చనిపోయారు. మరో ఏడుగురి ఆచూకీ గల్లంతయింది.

నీట మునిగిన ఇళ్లు
శ్రీలంకలో భారీ వర్షాలు
కొలంబోకు తూర్పున 85 కిలోమీటర్ల దూరంలో ఉన్న కెగల్లె జిల్లాలో కొండ చరియలు విరిగి పడి.. ఒకే కుటుంబానికి చెందిన నలుగురు చనిపోయినట్లు స్థానిక మీడియా తెలిపింది.
ఇదీ చూడండి:తిమింగలం కడుపులో 'నిధి'- రాత్రికి రాత్రే కోటీశ్వరులు
Last Updated : Jun 5, 2021, 5:44 PM IST