తెలంగాణ

telangana

ETV Bharat / international

తాగు నీరు, కరెంట్ లేక థాయిలాండ్ వాసుల అష్టకష్టాలు - థాయిలాండ్​లో భారీ వర్షాలు

థాయిలాండ్​లోని పలు రాష్ట్రాల్లో వరద తగ్గుముఖం పడుతోంది. వరద ఉద్ధృతి తగ్గినా.. ప్రజలు భయం గుప్పిట్లోనే ఉన్నారు. విద్యుత్ సరఫరా, తాగు నీరు లేక అవస్థలు పడుతున్నారు. మరోవైపు చారిత్రక కట్టడాలు, దేవాలయాలు ఇంకా వరద నీటిలోనే ఉన్నాయి.

Thailand floods
థాయిలాండ్​లో తగ్గుతున్న వరద ఉద్ధృతి

By

Published : Oct 4, 2021, 5:45 PM IST

థాయిలాండ్​లో వరద తగ్గుముఖం

ప్రకృతి ప్రకోపంతో విలవిలలాడిన థాయిలాండ్​ నెమ్మదిగా కోలుకుంటోంది. భారీ వర్షాల కారణంగా పోటెత్తిన వరద(Thailand floods) పలు రాష్ట్రాల్లో తగ్గుముఖం పడుతోంది. అయినప్పటికీ ఇంకా అనేక లోతట్టు ప్రాంతాలు వరద గుప్పిట్లోనే ఉన్నాయి. దీంతో తాగడానికి నీరు లేక ప్రజలు అవస్థలు పడుతున్నారు. వరద నీటినే ఇంటి అవసరాలకు వాడుకోవాల్సిన పరిస్థితి తలెత్తింది. మరోవైపు విద్యుత్​ సరఫరా నిలిచిపోయి అంధకారంలోనే గడుపుతున్నారు.

థాయిలాండ్​లో వరద నీటిలో చిక్కున్నఓ ప్రాంతం
ఉద్ధృతంగా ప్రవహిస్తున్న వరద నీరు

వరదల వల్ల ఇప్పటివరకు ఎనిమిది మంది మృతి చెందగా.. ఒకరు అదృశ్యమయ్యారని అధికారులు తెలిపారు. థాయిలాండ్​లోని 32 ప్రావిన్సుల్లో మొత్తం 2.71 లక్షలకుపైగా ఇళ్లు నీట మునిగాయని.. అయితే 14 ప్రావిన్సుల్లో వరద ఉద్ధృతి తగ్గుముఖం పడుతున్నట్లు పేర్కొన్నారు.

వరద నీటిలో ఉన్న దేవాలయాలు
నదులను తలపిస్తున్న వీధులు

మరోవైపు చారిత్రక నగరమైన ఆయుతాయలోని పలు దేవాలయాలు, కట్టడాలు వరద నీటిలోనే ఉన్నాయి.

ఇదీ చూడండి:వరదల్లో పారాగ్లైడర్ల సాహసం- ఆహారపొట్లాలతో ఎగురుకుంటూ వెళ్లి...

ABOUT THE AUTHOR

...view details