నేపాల్‌లో వర్షాలు బీభత్సాన్ని సృష్టిస్తున్నాయి. మనాంగ్, సింధుపాల్ చౌక్‌లో వరదల ధాటికి ఇప్పటివరకు 16 మంది మృతి చెందారు. మరో 22 మంది గల్లంతయ్యారు.
వర్షాల ధాటికి చాలా ఇళ్లు దెబ్బతిన్నాయి. వరదల ధాటికి వివిధ పట్టణాలు.. బురదతో నిండిపోయాయి. సహాయక చర్యలను అధికారులు కొనసాగిస్తున్నారు. వరదల్లో చిక్కుకున్న వారిని నేపాల్ సైన్యం తమ హెలికాప్టర్ల ద్వారా సురక్షిత ప్రాంతాలకు తరలించింది.