బంగ్లాదేశ్ చిట్టగాంగ్‌లో వేతనాలు పెంచాలని ఆందోళన చేసిన కార్మికులపై పోలీసులు జరిపిన కాల్పుల్లో ఐదుగురు మృతి చెందారు. మరో 20 మంది కార్మికులు గాయపడినట్లు స్థానిక మీడియా పేర్కొంది.
చిట్టగాంగ్‌లో చైనాకు చెందిన ఓ కంపెనీ.. థర్మల్ విద్యుత్ ప్లాంట్ నిర్మిస్తోంది. అందులో పనిచేస్తున్న కార్మికులంతా కొంతకాలంగా వేతనాలు, ఇతర సౌకర్యాలు కల్పించాలని ఆందోళన చేస్తున్నారు. శనివారం ఉదయం కంపెనీ వద్దకు భారీగా చేరిన కార్మికులు.. యాజమాన్యానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కంపెనీ లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించారు. వారిని అడ్డుకున్న పోలీసులపై రాళ్లు రువ్వారు.