తెలంగాణ

telangana

ETV Bharat / international

ప్రజా పంపిణీకి రష్యా​ వ్యాక్సిన్- తొలిబ్యాచ్​ విడుదల

ప్రపంచంలోనే తొలి కరోనా టీకాను ఆవిష్కరించిన రష్యా.. తొలిబ్యాచ్​ వ్యాక్సిన్​ను ప్రజలకు అందుబాటులోకి తెచ్చింది. నాణ్యత పరీక్షలో తమ టీకా అన్ని ప్రమాణాలను రుజువు చేసుకున్న నేపథ్యంలో ప్రజాపంపిణీకి విడుదల చేసినట్లు ఆరోగ్య శాఖ వెల్లడించింది.

Russian COVID-19 Vaccine
ప్రజాపంపిణీకి రష్యా​ వ్యాక్సిన్ తొలిబ్యాచ్​ విడుదల!

By

Published : Sep 8, 2020, 10:36 AM IST

కరోనా మహమ్మారి కట్టడిలో రష్యా మరో ముందడుగు వేసింది. తమ దేశ వ్యాక్సిన్-స్పుత్నిక్​-వీ​ తొలి బ్యాచ్​ను ప్రజాపంపిణీ కోసం విడుదల చేసింది. ప్రాంతీయ సరఫరాకు అతిత్వరలో ప్రణాళికలు రచించనున్నట్లు వెల్లడించింది రష్యా ఆరోగ్య శాఖ.

కరోనా మహమ్మారి కట్టడికి గమలేయా పరిశోధనా సంస్థ, ఆర్​డీఐఎఫ్​ సంయుక్తంగా అభివృద్ధి చేసిన స్పుత్నిక్​-వీ టీకా.. మెడికల్​ పరికరాల నియంత్రణ సంస్థ చేపట్టిన నాణ్యత పరీక్షల్లో అన్ని ప్రమాణాలను రుజువు చేసుకుంది. ఈ క్రమంలో తొలి బ్యాచ్​ను ప్రజా పంపిణీకి విడుదల చేశాం.

- రష్యా ఆరోగ్య శాఖ

కొన్ని నెలల్లోనే రాజధాని ప్రజలకు వ్యాక్సిన్​ అందిస్తామని మాస్కో మేయర్​ సేర్గీ సోబ్యానిన్​ ఆశాభావం వ్యక్తం చేసిన మరుసటి రోజునే తొలి బ్యాచ్​ను విడుదల చేయటం.. మాస్కో ప్రజల్లో ఆశలు రేకెత్తిస్తోంది.

ప్రపంచవ్యాప్తంగా కరోనా ఉద్ధృతి కొనసాగుతున్న వేళ.. తొలి టీకా స్పుత్నిక్​-వీని ఆగస్టు 11న రిజిస్టర్ చేసింది రష్యా ఆరోగ్య శాఖ.

ఇదీ చూడండి: ప్రతి నలుగురిలో ఒకరికి వ్యాక్సిన్​ వద్దంట!

ABOUT THE AUTHOR

...view details