హాంకాంగ్‌లో చైనా వ్యతిరేక ఆందోళన మరోసారి హింసాత్మకంగా మారింది. హాంకాంగ్ నేరస్థులను చైనాకు అప్పగించాలన్న బిల్లుకు వ్యతిరేకంగా వాణిజ్య కూడలి, పార్లమెంటు ఎదుట ఆందోళన చేస్తున్న ప్రజాస్వామ్యవాదులపై పోలీసులు వాటర్గన్లు, బాష్పవాయు గోళాలను ప్రయోగించారు.
ఇలా మొదలైంది..!
పార్లమెంట్ వద్దకు రాకుండా అడ్డుకునేందుకు యత్నించిన పోలీసులపై ఆందోళనకారులు కొన్ని వస్తువులు విసిరారు. మరికొందరు భద్రతా సిబ్బందిపై లేజర్ లైట్లను ప్రయోగించారు. నిరసనకారులను చెదరగొట్టేందుకు నీళ్లు, బాష్పవాయువును ప్రయోగించారు పోలీసులు. ఎప్పట్లాగే నలుపు రంగు టీ-షర్టులు, రంగుల గొడుగులు పట్టుకుని నిరసన వ్యక్తం చేశారు ఆందోళనకారులు.
అంతకుముందు చైనా మద్దతు పలుకుతున్న హాంకాంగ్ నేత కారీ లామ్ ఇంటిని ముట్టడించేందుకు ఆందోళనకారులు ప్రయత్నించారు.