తెలంగాణ

telangana

ETV Bharat / international

జపాన్​ చారిత్రక కోటలో అగ్నిప్రమాదం - షురి కోటలో భారీ అగ్ని ప్రమాదం

జపాన్​లోని చారిత్రక ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తింపు పొందిన షురి కోటలో అగ్ని ప్రమాదం సంభవించింది. భారీ ఎత్తున మంటలు వ్యాపించటం వల్ల తీవ్ర నష్టం వాటిల్లింది.

జపాన్​ చారిత్రక కోటలో అగ్నిప్రమాదం

By

Published : Oct 31, 2019, 1:15 PM IST

జపాన్​ చారిత్రక కోటలో అగ్నిప్రమాదం

జపాన్​లోని దక్షిణ ద్వీపం ఓకినావాలోని చారిత్రక షురి కోటలో పెద్దఎత్తున మంటలు చెలరేగాయి. ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తింపు పొందిన ఈ కోట.. ప్రమాదం కారణంగా తీవ్రంగా దెబ్బతింది.

మంటలను అరికట్టేందుకు అగ్నిమాపక సిబ్బంది రంగంలోకి దిగింది. ముందు జాగ్రత్తగా పరిసరాల్లోని స్థానికులను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ఈ ప్రమాదంలో కోటలోని ప్రధాన సీడెన్​ ఆలయంతో పాటు ఉత్తర, దక్షిణ ఆలయాలు ధ్వంసమయ్యాయి. అయితే.. ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు.

కోట చరిత్ర ఇదే..

సుమారు 500 ఏళ్ల చరిత్ర కలిగిన ఈ కోటను యూక్యువాన్​ రాజు కాలం నాటికి చెందినదిగా చరిత్రలు చెబుతున్నాయి. రెండో ప్రపంచ యుద్ధ సమయంలో... దాడి జరిగి ధ్వంసం అయ్యింది. ఆ తర్వాత 1992లో పునరుద్ధరించి.. జాతీయ పార్కుగా మార్చారు. 2000 సంవత్సరంలో ఈ కోటను ప్రపంచ వారసత్వ సంపద జాబితాలో చేర్చింది యునెస్కో.

ఇదీ చూడండి: 90 నిమిషాల 'ఆపరేషన్​ బాగ్దాదీ'​ సాగిందిలా..!

ABOUT THE AUTHOR

...view details