హాంకాంగ్‌లో జన సంచారం ఎక్కువగా ఉండే కౌలూన్ ప్రాంతంలో అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఏడుగురు చనిపోగా... మరికొందరికి గాయాలయ్యాయి. కౌలూన్ ప్రాంతం స్థానిక వ్యాపార సంస్థలతో ఎప్పుడూ రద్దీగా ఉంటుంది. అక్కడ ఉండే పాత అపార్ట్మెంట్లో మంటలు చెలరేగాయి. గాయపడిన వారిలో చిన్నారులు ఎక్కువ మంది ఉన్నట్లు సమాచారం.
హాంకాంగ్‌లో అగ్నిప్రమాదం-ఏడుగురు మరణం - హాంకాంగ్‌లో అగ్ని ప్రమాదం
హాంకాంగ్‌లో జరిగిన అగ్ని ప్రమాదంలో ఏడుగురు మరణించారు. అధికరద్దీ ఉన్న ప్రాంతంలో మంటలు చెలరేగడం వల్ల మరికొందరికి గాయాలయినట్లు అక్కడి అధికారులు తెలిపారు.
![హాంకాంగ్‌లో అగ్నిప్రమాదం-ఏడుగురు మరణం Fire causes multiple deaths and injuries in Hong Kong](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-9555783-573-9555783-1605502405262.jpg)
హాంకాంగ్‌లో అగ్నిప్రమాదం-ఏడుగురు మరణం
ఈ ప్రాంతంలో ఎక్కువమంది దక్షణాసియాకి చెందినవారు ఉంటారు. లోకల్ మీడియా విడుదల చేసిన వీడియోలో చైనీయులు ఉన్న ఆనవాళ్లు కనిపించలేదు. హాంకాంగ్ నాయకురాలు క్యారీ లామ్ జరిగిన ఘటనపై విచారం వ్యక్తం చేశారు.
Last Updated : Nov 16, 2020, 11:13 AM IST