తెలంగాణ

telangana

ETV Bharat / international

'అందరూ సేఫ్.. మా దేశంలో కరోనా లేనే లేదు' - పిజీలో కొవిడ్​-19 కేసులు

కరోనా రహిత దేశంగా ప్రకటించుకుంది ఫిజీ ద్వీపం. మార్చి 19న తొలి వైరస్​ కేసు నమోదు అయింది. అప్పటి నుంచి కేవలం 18 మంది మాత్రమే వైరస్​ బారిన పడ్డారు. వారందరూ కోలుకున్నారని ఆ దేశ ప్రధాని ఒరెక్​ బైనిమారామా వెల్లడించారు. వైరస్​తో ఎవరూ మృతి చెందలేదని వెల్లడించారు.

Fiji declares itself free of COVID-19
కరోనా రహిత దేశంగా ఫిజీ ద్వీపం

By

Published : Jun 5, 2020, 10:26 PM IST

ప్రపంచ దేశాలు కరోనా కోరల్లో చిక్కుకొని విలవిల్లాడుతున్నాయి. ఈ పరిస్థితుల్లో కీలక ప్రకటన విడుదల చేసింది ఫిజీ ద్వీపం. తమది కరోనా రహిత దేశమని ప్రకటించుకుంది. వైరస్ బారిన వారంతా కోలుకున్నట్లు అక్కడి ఆరోగ్య శాఖ ప్రకటన విడుదల చేసింది. ప్రాణాంతక వైరస్​ వ్యాప్తిని నివారించడానికి చాలా శ్రమించినట్లు స్పష్టం చేసింది.

"కరోనా వ్యాప్తిని నివారించడానికి అందరం కలిసికట్టుగా పని చేస్తున్నాం. ఏ స్థాయిలోనూ మా ప్రయత్నాలు విరమించుకోకుండా దేశానికి భరోసా ఇవ్వాలనుకుంటున్నాం. సాధ్యమైనంత వరకు అప్రమత్తంగా వ్యవహరిస్తూ కొవిడ్​-19పై విజయం సాధిస్తాం."

-ఇఫెరీమి వాకైనాబేటే, ఫిజీ ఆరోగ్యశాఖ మంత్రి

92శాతం జనాభాకు పరీక్షలు..

ఇప్పటివరకు 2,000 మందికి పైగా వైరస్​ పరీక్షలు చేయించినట్లు వెల్లడించారు ఇఫెరీమి. దేశ జనాభాలో 92శాతం మందికి కరోనా​ పరీక్షలు నిర్వహించామని స్పష్టం చేశారు. ప్రస్తుతం 100మంది క్వారంటైన్​లో ఉన్నట్లు చెప్పారు.

వైరస్​ మరణాలు జీరో!

ఇప్పటివరకు దేశంలో ఒక్క కరోనా మరణం సంభవించలేదని ఆ దేశ ప్రధాని ఒరెక్​ బైనిమారామా స్పష్టం చేశారు. కరోనా బారిన పడిన 18మంది కోలుకున్నారని తెలిపారు.

ఫిజీలో మార్చి 19న తొలి వైరస్​ కేసు నమోదు అయ్యింది. అప్పటి నుంచి కొవిడ్​-19 నివారణకు భౌతిక దూరం, సమావేశాలపై కఠిన ఆంక్షలు విధించింది అక్కడి అధికార యంత్రాంగం. ఫలితంగా కరోనాపై విజయం సాధించినట్లు ప్రభుత్వం ప్రకటించింది. ​

ఇదీ చూడండి:ట్వీట్​ బ్లాక్​తో ట్రంప్​కు మళ్లీ షాక్

ABOUT THE AUTHOR

...view details