కశ్మీర్ ప్రజలతో పాటు నిలబడిన వారు జిహాద్‌ను అనుసరించినట్టేనని పాకిస్థాన్ ప్రధాని తెలిపారు. ప్రపంచమంతా వ్యతిరేకించినా.. కశ్మీర్ ప్రజలకు పాకిస్థాన్ అండగా నిలుస్తుందన్నారు. అమెరికా పర్యటన ముగించుకుని పాక్‌లో అడుగుపెట్టిన అనంతరం ఖాన్ ఈ వ్యాఖ్యలు చేశారు.
'కశ్మీర్ ప్రజల కోసం పోరాడితే అది జిహాద్‌తో సమానం. అల్లా ఆనందంగా ఉండాలనే పోరాటం చేస్తున్నాం. ఒడుదొడుకులు ఎదురైనా నిరాశ చెందకండి. కశ్మీర్ ప్రజలు మీ సహాయం కోసం చూస్తున్నారు. పాక్ ప్రజలు సహాయం చేస్తే కశ్మీరీ ప్రజలు కచ్చితంగా గెలుస్తారు.'
--- ఇమ్రాన్‌ఖాన్, పాక్ ప్రధాని.
కశ్మీర్‌లో కర్ఫ్యూ విధించి ప్రజల్ని బందీలను చేశారంటూ ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశంలో ఇమ్రాన్ చేసిన విద్వేష ప్రసంగం సంగతి తెలిసిందే. ఇమ్రాన్ ప్రసంగాన్ని భారత్ ఖండించింది.