ఈక్వెడార్‌లోని రెండు జైళ్లలో ఖైదీల మధ్య ఘర్షణ తలెత్తింది. ఈ ఘటనల్లో 18 మంది ప్రాణాలు కోల్పోయారు. పదుల సంఖ్యలో గాయాలపాలయ్యారని అధికారులు తెలిపారు.
గౌయాక్విల్ నగరంలోని ప్రధాన కారాగారం, సెంట్రల్ ఈక్వెడార్‌లోని లటకుంగా జైలులో బుధవారం ఈ అల్లర్లు చెలరేగినట్లు అధికారులు తెలిపారు. ఈ ఘటనల్లో 9 మంది పోలీసులు, 35 మంది ఖైదీలు తీవ్రంగా గాయపడినట్లు చెప్పారు. ప్రస్తుతం పరిస్థితులు అదుపులోనే ఉన్నట్లు పేర్కొన్నారు.