ప్రపంచవ్యాప్తంగా కరోనాను ఎదుర్కొనేందుకు చర్యలు తీసుకుంటున్నా.. ఆ మహమ్మారి అంతకంతకూ విస్తరిస్తోంది. కరోనా ధాటికి అన్ని దేశాల్లో కలిపి ఇప్పటివరకు 1.61 లక్షల మంది మృతి చెందారు. వీరిలో రెండో వంతు మరణాలు ఐరోపా దేశాల్లోనే నమోదయ్యాయి.
ప్రపంచవ్యాప్తంగా ఇప్పటివరకు కరోనా బాధితుల సంఖ్య 23,47,249కు చేరగా.. ఇందులో సగం కేసులు (11,51,820) ఐరోపాలోనే నమోదయ్యాయి. దేశాలవారీగా చూస్తే అమెరికాలో కేసులు, మరణాల సంఖ్య అధికంగా ఉంది. అమెరికాలో 7,38,923 కేసులు నమోదు కాగా.. మృతుల సంఖ్య 39,015కు పెరిగింది.
స్పెయిన్‌లో తగ్గుముఖం..
స్పెయిన్‌లో మృతుల సంఖ్య తగ్గుముఖం పట్టింది. ఆ దేశంలో ఇవాళ 410 మంది మరణించారు. మొత్తంగా స్పెయిన్‌లో 20,453మంది కరోనాకు బలయ్యారు. ఇటలీలో 23,227 మంది, , ఫ్రాన్స్‌లో 19,323 మంది, బ్రిటన్‌లో 15,464 మంది చనిపోయారు.
దక్షిణ కొరియాలోనూ కేసుల సంఖ్య తగ్గుముఖం పట్టింది. రెండు నెలల తర్వాత కొత్త కేసుల సంఖ్య సింగిల్ డిజిట్‌కు పడిపోయింది. దక్షిణ కొరియాలో మొత్తం 10,661 కేసులు నమోదుకాగా... 234 మంది మరణించారు.
సింగపూర్‌లో విజృంభణ..