తాలిబన్లు అఫ్గానిస్థాన్‌ను(Afghanistan Taliban news) ఆక్రమించిన తర్వాత వారు టొలో న్యూస్‌కు ఒక ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ సమయంలో తాలిబన్ ప్రతినిధి ఇంటర్వ్యూను ఓ మహిళా జర్నలిస్టు తీసుకొంది. అప్పట్లో అది ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. తాలిబన్లు కూడా తాము మారిపోయాం అని చెప్పుకోవడానికి ఆ ఇంటర్వ్యూను వాడుకొన్నారు. కానీ, తాజాగా ఆ మహిళా జర్నలిస్టు (Afghanistan Journalist) ప్రాణభయంతో దేశం విడిచి పారిపోయింది.
టొలో న్యూస్‌లో కొత్తగా చేరిన 24 ఏళ్ల బెహెస్తా అర్ఘాంద్ ఈ నెల 17వ తేదీన తాలిబన్ల ప్రతినిధిని ఇంటర్వ్యూ చేసింది. ఇది పత్రికల పతాక శీర్షికలను ఎక్కింది. కానీ, ఆమె తాలిబన్ చేతిలో దాడికి గురైన మలాలా యూసఫ్ జాయ్‌ను కూడా ఆ తర్వాత ఇంటర్వ్యూ చేసింది. మలాలా టోలో న్యూస్‌కు ఇంటర్వ్యూ ఇవ్వడం కూడా అదే తొలిసారి. ఇది బెహస్తాను ప్రమాదంలోకి నెట్టింది. ఆమె ఆఫీస్‌కు వెళ్లడం మానేసింది. చివరికి దేశం విడిచి వెళ్లిపోయింది. "లక్షల మంది అఫ్గాన్ ప్రజల వలే నేను నా దేశాన్ని విడిచి వెళ్లపోతున్నాను. తాలిబన్లకు(Taliban news) భయపడుతున్నాను" అని ఆమె పేర్కొన్నారు. ఆమె ఈ విషయాన్ని సీఎన్‌ఎన్ బిజినెస్‌కు వాట్సాప్ సందేశం ద్వారా తెలియజేశారు.
కల చెదిరింది..
బెహెస్తా అర్ఘాంద్ తొమ్మిదో తరగతి చదువుతుండగా జర్నలిస్టు కావాలని ఆశించంది. పాఠశాల తరగతి గదిలో టీచర్ ప్రోత్సాహంతో ఆమె ఓ న్యూస్ యాంకర్ వలే వార్తలు చదివారు. ఆ ఘటన ఆమెలో టీవీ జర్నలిస్టు కావాలనే ఉత్సాహాన్ని పుట్టించింది. ఆ తర్వాత ఆమె కాబుల్ విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం పట్టా అందుకొన్నారు. అనంతరం ఆమె చాలా న్యూస్ ఏజెన్సీలు, రేడియోల్లో పనిచేశారు. ఎట్టకేలకు అఫ్గానిస్థాన్‌కు చెందిన ప్రముఖ ఛానెల్ టొలో న్యూస్‌లో చేరారు. కానీ, ఆమె అక్కడ నెలా ఇరవై రోజులు మాత్రమే విధులు నిర్వహించారు. ఈ లోపు కాబుల్‌ను తాలిబన్లు హస్తగతం చేసుకొన్నారు.
చరిత్రలో తొలిసారి తాలిబన్‌తో టీవీ ఇంటర్వ్యూ..