వరిసాగులో తనదైన ముద్ర వేస్తున్న చైనా.. సరికొత్త వంగాడాలను ఆవిష్కరించింది. ఇప్పటికే ప్రపంచంలో అత్యధికంగా వరిని ఉత్పత్తి చేస్తుండగా.. ప్రస్తుతం రెండు మీటర్ల పొడవైన వరి మొక్కలను సాగును ప్రారంభించింది. ఈ వంగడాలతో ఎకరా స్థలంలో రెట్టింపు ధాన్యాన్ని పండించవచ్చని చెబుతోంది. ఈ మేరకు నైరుతి చైనాలోని చాంగ్కింగ్లో ఓ హెక్టార్ విస్తీర్ణంలో ప్రయోగాత్మక సాగు చేపట్టింది. ప్రస్తుతానికి ఈ వంగడం అభివృద్ధి దశలో ఉందని.. ఆమోదం లభించగానే పెద్ద ఎత్తున ఉత్పత్తి ప్రారంభమవుతుందని చెబుతున్నారు శాస్త్రవేత్తలు.
ఈ వరి రకంతో ఎకరం కంటే తక్కువ విస్తీర్ణంలోనే 800 కేజీల దిగుబడి వస్తుందని అంచనా వేస్తున్నారు. మొక్కలు పైకి ఎదుగుతాయి కాబట్టి.. పొలాల్లో చేపలను సైతం పెంచుకోవచ్చని సూచిస్తున్నారు శాస్త్రవేత్తలు. ఈ కొత్త రకంతో రైతుల ముఖాల్లో చిరునవ్వు వెల్లివిరుస్తుందంటున్నారు.